నిడమర్రులో బాధిత రైతులతో వైయస్ జగన్ ముఖాముఖి

అమరావతిః టీడీపీ సర్కార్ భూదోపిడీపై వైయస్ జగన్ నిప్పులు చెరిగారు. రాజధాని ప్రాంత పర్యటనలో భాగంగా నిడమర్రుకు చేరుకున్న వైయస్ జగన్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రం మొత్తం చూసేలా..దేశానికి తెలిసేలా ఇవాళ ఈ ప్రాంతానికి వచ్చానని వైయస్ జగన్ అన్నారు. ఇప్పటికే మూడు సార్లు ఈ ప్రాంతానికి వచ్చానని పేర్కొన్నారు. ల్యాండు ఫూలింగ్‌ వ్యతిరేకించిన రైతులపై టీడీపీ దౌర్జన్యం చేసినప్పుడు, అరటి తోటలకు నిప్పంటించిన సందర్భంలో కూడా వచ్చాను. బలవంతంగా భూములు తీసుకునే పెనుమాక, ఉండవల్లి, నవనూరు, ఎ్రరబాలేం ఊర్లకు మనం పోకూడదట. ఎక్కడైతే నోటీసులు ఇచ్చారో అక్కడికి వెళ్లకూడదట. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నన్ను అక్కడికి వెళ్లకుండా బాబు అడ్డుకున్నారు. ఎందుకంటే. అక్కడ టెంపరరీ సెక్రటేరియట్‌ ఉంది కాబట్టి అక్కడికి వెళ్లకూడదట. ప్రతిపక్ష నేతలు ఆ రోడ్డు మీద ప్రయాణం చేయకూడదట అని ఆర్కే చెప్పినప్పుడు ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కత్తి తీసుకొని పొడుస్తున్నట్లు కనిపించింది. బాబు లాంటి సీఎంను చూసి సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోంది. ఇవాళ ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు, ఏ గ్రామాలకు వెళ్లకుండా కట్టడి చేశారో ఆ గ్రామాల వారిని కూడా ఇక్కడికి రమ్మన్నాము. మీరు పడుతున్న ఇబ్బందులు, సమస్యలు మీరే చెప్పండి. అప్పటికైనా చంద్రబాబుకు జ్ఞానోదయం వస్తుందని దేవున్ని కోరుకుందాం. మీకు ఎల్లవేళలా వైయస్‌ఆర్‌సీపీ తోడుగా ఉంటుందని వైయస్ జగన్ అన్నారు.  ఈసందర్భంగా రైతులతో ముఖాముఖి మాట్లాడుతున్నారు. 

Back to Top