విశ్వబ్రాహ్మణుల కార్పొరేషన్‌ను పునరుద్దరిస్తాం


కృష్ణా జిల్లా :   వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే విశ్వబ్రాహ్మణుల కార్పొరేషన్‌ను పునరుద్దరిస్తామని వైయ‌స్‌ జగన్  హామీ ఇచ్చారు. 
ప్రజాసంకల్పయాత్రలో భాంగా  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బుధవారం పొట్లపాలెంలో విశ్వబ్రాహ్మణులతో ముఖాముఖీ అయ్యారు. ఈ సందర్భంగా స్వర్ణకారులు తమ సమస్యలను...రాజన్న తనయుడికి విన్నవించుకున్నారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో విశ్వబ్రాహ్మణులకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని, సామాజికంగా, ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన కులాలు తమవని, ఆదుకోవాలంటూ వైయ‌స్‌ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జీవో నంబర్‌ 23 అమల్లో ఉండేదని, అప్పుడు కార్పొరేషన్‌ ఉన్నదానిని చంద్రబాబు ప్రభుత్వం ఫెడరేషన్‌గా మార్చేసింద‌న్నారు.  జీవో 272 వైయ‌స్‌ఆర్‌ హయాంలో ఉండేది. 272 జీవో వల్ల వేధింపులకు గురికాకుండా రక్షణగా ఉండేద‌న్నారు.  వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే విశ్వబ్రాహ్మణులకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామ‌ని మాట ఇచ్చారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేసే ఆర్థిక స్తోమత లేకపోవడంతో విశ్వబ్రాహ్మణుల తరఫు నుంచి ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చేలా చూస్తామని వైయ‌స్‌ జగన్‌ హామీ ఇచ్చారు. విశ్వ‌బ్రాహ్మ‌ణ మ‌హిళ‌ల‌కు 45 ఏళ్ల‌కే పింఛ‌న్ మంజూరు చేస్తామ‌ని మాట ఇచ్చారు. వైయ‌స్ జ‌గ‌న్ హామీతో విశ్వ‌బ్రాహ్మ‌ణులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. తామంతా వైయ‌స్ జ‌గ‌న్ వెంటే ఉంటామ‌ని ముక్త‌కంఠంతో పేర్కొన్నారు.




Back to Top