పేదల ఉసురు తగిలి పోతాడు..!

పేదలను కొట్టి సింగపూర్ కు దోచిపెడుతున్నాడు..!
భోగాపురంలో రైతులకు అండగా వైఎస్ జగన్..!
మన ప్రభుత్వం వచ్చిన వెంటనే భూములిచ్చేస్తాం..!
విజయనగరం: ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భోగాపురం ఎయిర్ పోర్ట్ బాధిత రైతులకు అండగా నిలిచారు. ఎయిర్ పోర్టు కోసం పేదల భూములను చంద్రబాబు గద్దల్లా లాక్కుంటున్నారని జగన్ ధ్వజమెత్తారు. రైతుల ఇష్టం లేకుండా ఎవరూ భూములు లాక్కోలేరన్నారు. భూములు తీసుకోవాలని ప్రయత్నిస్తే రైతుల తరుపున న్యాయపోరాటం చేస్తామన్నారు. అవసరమైతే కోర్టుకు వెళదామని భోగాపురం ప్రాంత రైతులకు భరోసా కల్పించారు. పేదల  ఉసురు పోసుకొని భూములు లాక్కుంటే చంద్రబాబు బంగాళాఖాతంలో కలవడం ఖాయమన్నారు. రానున్న రోజుల్లో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, వచ్చిన వెంటనే భూములను వెనక్కి ఇచ్చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. 

చంద్రబాబు బినామీలు..!
విమానాశ్రయ ఏర్పాటును నిరసిస్తూ ఎ.రావివలసలో రిలేనిరాహార దీక్ష చేస్తున్న రైతులను వైఎస్ జగన్ పరామర్శించారు. ఆతర్వాత గూడెపువలస గ్రామానికి చేరుకొని దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన బహిరంగసభలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇదే ప్రాంతంలో అయ్యన్నపాత్రుడు భూములున్నా వాటిని వదిలి..పేదల భూములు గుంజుకునే అధికారం ఎవరిచ్చారని జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎయిర్ పోర్టు పేరుతో పేదల భూములు లాక్కొని కోట్లు రూపాయలు  కొల్లగొట్టేందుకు చంద్రబాబు బినామీలైన అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్ లు ప్రయత్నిస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. 

రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం..!
అడిగిన వాళ్లపై పోలీసు కేసులు పెడతారు. స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక బ్రిటీష్ పాలనలో ఉన్నామా అనిపిస్తోందని వైఎస్ జగన్ అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా ఎయిర్ పోర్ట్ కోసం వేయి, పన్నెండొందలకు మించి ఎకరాలు లేవని.. ఇక్కడ వేల ఎకరాలు ఎందుకు దోచుకుంటున్నారని వైఎస్ జగన్ ప్రశ్నలు సంధించారు. విశాఖలో ఉన్న ఎయిర్ పోర్టును అభివృద్ధి చేయకుండా భోగాపురంలో పేదల భూములపై ఎందుకు పడుతున్నారన్నారు.  అక్కడ ఉన్న భూములు కాదని, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, సింగపూర్ వాళ్లకు దోచిపెట్టడం కోసం  ఇక్కడి భూములను దోచుకుంటున్నారని విమర్శించారు.  

అంతా మోసమే..!
బాబు వస్తే జాబు వస్తుందన్నాడు. అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నాడు. ఉద్యోగం రాకపోతే నెలకు రూ.2 వేల నిరుద్యోగభృతి ఇస్తామని చెప్పి ఇప్పుడు మాటమారుస్తారని వైఎస్ జగన్ దుయ్యబట్టారు. రైతులు, డ్రాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మోసం చేశాడన్నారు. చంద్రబాబు ఇచ్చిన రుణాలు వడ్డీలకు కూడా సరిపోక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి ఉందన్నారు. 

నోరుతెరిస్తే అబద్ధాలే..!
బలవంతపు భూసేకరణ అన్యాయమని  ప్రధానమంత్రే చట్టాన్నే వెనక్కితగ్గినప్పుడు ..ఏ అదికారముందని చంద్రబాబుకు భూములను లాక్కుంటున్నారని  జగన్ నిలదీశారు. చంద్రబాబు జీవితమంతా మోసం, అబద్దం, దౌర్జన్యాలేనని వైఎస్ జగన్ అన్నారు. మళ్లీ మళ్లీ భోగాపురం వస్తాను..పేదలను వేధిస్తే ఇదే వేదికపై దీక్షకు దిగుతానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చనిపోయిన వారి కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని జగన్ ప్రకటించారు. అందరం గట్టిగా నిలబడి పోరాడుదామని బాధితులకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. 
Back to Top