చంద్రబాబు మోసం చేశాడుఅనంతపురం: చంద్రబాబు ఈ నాలుగేళ్ల పాలనలో రైతులు, డ్వాక్రా సంఘాలను మోసం చేశాడా?లేదా అని కదిరి ప్రజలకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. ఇందుకు ప్రజలందరూ అవును..మోసం చేశారని నినదించారు. శనివారం సాయంత్రం కదిరిలో వైయస్‌ జగన్‌ ప్రజలతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మనం అధికారంలోకి వచ్చాక బ్యాంకులకు వడ్డీ లెక్కలు కడుతామని, ఎన్నికలు అయిపోయిన రెండో రోజు మీరు బ్యాంకులకు వెళ్లి రసీదులు తీసుకోండని, మనం వచ్చాక నాలుగు విడతల్లో మీ డబ్బులు మీ చేతుల్లో పెడతామని, ఈ విషయాన్ని అందరికి బాగా చెప్పండి అని సూచించారు. మీ పిల్లలను బడికి పంపిస్తే ప్రతి ఏటా తల్లి ఖాతాలో రూ.15 వేలు జమా చేస్తామని చెప్పారు. అలాగే పింఛన్‌ నెల రూ.2 వేలు ఇస్తామని చెప్పారు.
 
Back to Top