అన్నొస్తున్నాడని అందరికీ చెప్పండి– ప్రజా సంకల్ప యాత్రకు పోటెత్తిన ప్రజలు
– దారి పొడువునా సమస్యలు వింటూ ముందుకు సాగుతున్న వైయస్‌ జగన్‌

నెల్లూరు: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నెల్లూరు జిల్లాలో దిగ్విజయంగా సాగుతోంది. పాదయాత్ర దారులన్నీ జనంతో పోటెత్తున్నాయి. గ్రామ గ్రామాన పండుగ వాతావరణం నెలకొంది. దారిపొడువునా ప్రజా సమస్యలు వింటూ ముందుకు సాగుతున్నారు వైయస్‌ జగన్‌. ఇవాళ ఉదయం నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని వైయస్‌ జగన్‌ పాదయాత్ర అడుగుపెట్టింది. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ స్థానికులతో మమేకమయ్యారు. మన చిట్టి పి ల్లలను బడికి పంపిస్తే జగనన్న ప్రతి ఏటా రూ.15 వేలు ఇస్తాడని అందరికి చెప్పండి అంటూ మహిళలకు సూచించారు. అవ్వలకు కూడా చెప్పండి..మీ మనవడు ముఖ్యమంత్రి అయిన వెంటనే పింఛన్‌ రూ.2 వేలు ఇస్తాడని చెప్పండని వివరించారు. అలాగే చంద్రబాబు మనల్ని ఎట్లా మోసం చేశాడో అందరికి చెప్పండని సూచించారు. ఎన్నికల సమయానికి మీకు ఎంత అప్పు అయితే ఉంటుందో ఆ డబ్బంతా నాలుగు దఫాల్లో మొత్తం మీ చేతులకే ఇస్తాం. ఈ విషయాన్ని కూడా అందరికి చెప్పండని వైయస్‌ జగన్‌ మహిళలకు భరోసా కల్పించారు. జగనన్న హామీతో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

 
Back to Top