స్వాతంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్ః వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తెలుగు ప్ర‌జ‌ల‌కు 71వ స్వాతంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. స్వాతంత్రం కోసం పోరాడిన అమ‌ర‌వీరుల అడుగు జాడ‌ల్లో న‌డ‌ుద్దామని అన్నారు.  మ‌హ‌నీయుల నిబద్ధత,  దేశభక్తి మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టింద‌న్నారు. స్వాతంత్ర స‌మ‌ర‌యోధుల ఆశ‌యాల‌కు అనుగునంగా మ‌నం న‌డుచుకోవాల‌న్నారు. 


వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌ను నిర్వ‌హించనున్నారు. ఉద‌యం 9:30 గంట‌ల‌కు వైయ‌స్ఆర్ సీపీ సీనియ‌ర్ నేత‌, ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి  జాతీయ జెండాను ఎగుర‌వేయ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొనాల‌ని పార్టీ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. 
Back to Top