వైయ‌స్‌ జగన్‌ కీలక భేటీ

 
 కృష్ణా జిల్లా : ప్రత్యేక హోదా ఉద్యమ భవిష్యత్‌ కార్యాచరణపై వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాజీనామా చేసిన ఎంపీలు, పార్టీ రీజనల్‌ కో-ఆర్డినేటర్లతో అగిరిపల్లిలో ఆదివారం సమావేశమయ్యారు. సాయంత్రం మొదలైన భేటీ ఇంకా కొనసాగుతోంది.
సమావేశం ముగిసిన తర్వాత రాజీనామా చేసిన ఎంపీలు మీడియా సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణపై ప్రకటన చేయనున్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌ హక్కు అనే నినాదంతో హోదాపై పోరుబాట పట్టిన వైయ‌స్ఆర్‌ సీపీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్లు, రీజనల్‌ కో-ఆర్డినేటర్లతో భేటీ అయిన వైయ‌స్‌ జగన్‌ స్థానికంగా ప్రజల అభిప్రాయాలను నేతల నుంచి తెలుసుకుంటున్నారు. ఏపీకి హోదా కోసం గత పార్లమెంటు సమావేశాల్లో 13 సార్లు కేంద్రంపై అవిశ్వాసం తీర్మానం ప్రవేశిపెట్టిన  వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు ఆ తర్వాత ఆమరణ నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే.
ప్ర‌త్యేక హోదాపై పోరాడే పార్టీలు, పక్షాలు, ప్రజా సంస్థలను కూడా ఏకతాటిపైకి తెచ్చి ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు కూడా వైయ‌స్ఆర్‌స‌పీ  యోచిస్తోంది. ఇప్పటికే ప్రత్యేక హోదా కోసం వామపక్షాలు, ప్రజా సంఘాలు చేసిన దీక్షలకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.


Back to Top