వైయస్ జగన్ హోలీ శుభాకాంక్షలు

హైదరాబాద్‌:

 హోలీ పండుగ సందర్భంగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంగుల పండుగ అందరి జీవితాలను వర్ణశోభితం చేయాలని, వసంత రుతువు ఆగమనాన్ని సూచించే ఈ పండుగ జరుపుకుంటున్న వారందరికీ శుభం జరగాలని ఆయన ఆకాంక్షించారు. హోలీ సందర్భంగా సురక్షితమైన సేంద్రీయ రంగులను వాడాలని ఆయన సూచించారు.


Back to Top