క్రమంగా క్షీణిస్తోన్న ఆరోగ్యం..!

గుంటూరుః ప్రత్యేకహోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ ఆరోగ్యం మరింత క్షీణిస్తోంది. దీంతో దీక్షా శిబిరం వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొంది. వైఎస్ జగన్ ఆరోగ్యానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వైఎస్ జగన్ ను ఈస్థితిలో చూసి కంటతడి పెడుతున్నారు. వైఎస్‌ జగన్‌ ఆరోగ్యం  చాలా విషమంగా వుందని విజయవాడ నుంచి వచ్చిన డాక్టర్ల బృందం తెలిపింది. దీక్ష కొనసాగితే పరిస్థితులు చేజారే ప్రమాదం వుందని డాక్టర్లు తెలిపారు.
 
కాగా కోట్లాది ప్రజల కోసం  దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ కు విజయవాడ నుంచి వచ్చిన డాక్టర్లు సంఘీభావం  తెలిపారు. సీనియర్‌ నెఫ్రాలజిస్ట్ డాక్టర్‌ బోడేపూడి చౌదరి నాయకత్వంలో డాక్టర్లు బృందం వైఎస్‌ జగన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు, వైఎస్ జగన్ ఆరోగ్యం విషమిస్తున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు భయాందోళనకు గురవుతున్నారు.
Back to Top