ప్రత్యేకహోదా మనహక్కు..కలిసి పోరాడుదాం....!

తిరుపతి యువభేరిలో గర్జించిన జననేత..!
హోదా సాధించేవరకు విశ్రమించం..!

ఏపీకి ప్రత్యేకహోదా కోసం విద్యార్థులు, యువత కలిసికట్టుగా పోరాడి సాధించుకుందామని ప్రతిపక్షనేత వైఎస్ జగన్  పిలుపునిచ్చారు.తిరుపతి పీఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ప్రత్యేకహోదా-ఉద్యోగఅవకాశాలు-రాష్ట్రాభివృద్ధి అన్న అంశంపై జరిగిన అవగాహన సదస్సుకు వైఎస్ జగన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులనుద్దేశించి జగన్ ఆద్యంతం ఉత్తేజభరితంగా ప్రసంగించారు. 

ప్రత్యేక హోదా కోసం అన్న పేరుతో వైెఎస్సార్సీపీ రూపొందించిన కరపత్రం. ఈ రెండు పేజీల కరపత్రంలో ప్రత్యేక హోదా ఆవశ్యకత ను తెలియచెప్పే వివరాలు లభ్యం.. 
Click here To download the file : Pamphlet on special status

ప్రత్యేకహోదా ఒక అవసరం..
రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు పార్లమెంటులో దారుణంగా ప్రవర్తించారు. మన పార్టీ ఎంపీలను బయటకు పంపించి..తలుపులు మూసేశారు. కాంగ్రెస్ తో  కుమ్మక్కై చంద్రబాబు రాష్ట్రాన్ని విభజించారని జగన్ విమర్శించారు. పార్లమెంటు సాక్షిగా ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని ప్రధాని చెప్పారు. బీజేపీ ఒప్పుకుంది. కానీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని జగన్ మండిపడ్డారు. ప్రత్యేకహోదాపై చంద్రబాబు ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెడుతూ పూటకో అబద్ధం చెబుతున్నారని జగన్ ధ్వజమెత్తారు. కమీషన్ల రూపంలో లంచాలు తీసుకుంటూ చంద్రబాబు అవినీతిని కొనసాగిస్తున్నారని,  ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకు మోడీవద్ద సాగిలపడ్డారని విరుచుకుపడ్డారు. 

మెడలు వంచుతాం..!
ప్రత్యేకహోదా కోసం నిరంతరం పోరాడుతున్నామని, మంగళగిరిలో రెండ్రోజుల సమరదీక్షతో పాటు  ఢిల్లీలో మహాధర్నా, రాష్ట్రబంద్  చేపట్టామని జగన్ తెలిపారు. ఈనెల 26 నుంచి చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్షతో టీడీపీ, బీజేపీలపై ఒత్తిడి తీసుకొస్తామని జగన్ తేల్చిచెప్పారు. యూనివర్సిటీలో యువభేరి నిర్వంహించాలని భావిస్తే నిబంధనల పేరుతో ప్రభుత్వం అడ్డుకోవాలని చూసిందని వైఎస్ జగన్ విమర్శించారు. ఇదే యూనివర్సిటీలో టీడీపీ నేతలు సభలు,సమావేశాలు పెట్టుకోలేదా..? అని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనుమతి నిరాకరించినా...వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులను జగన్ అభినందించారు. 
Back to Top