వేరుశనగ రైతుల సమస్యల్ని విని చలించిన జన నేత వైయస్ జగన్

పులివెందుల)) సొంత
నియోజక వర్గం పులివెందుల లో పర్యటిస్తున్న ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ
అధ్యక్షులు వైయస్ జగన్ రైతుల్ని పలకరించారు. వైయస్సార్ జిల్లా తొండూరు మండలం ఇనగలూరులో
వేరుశెనగ పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మొలకెత్తని విత్తానాల
గురించి తమ గోడు వినిపించారు.

 రైతుల సమస్యలపై వైయస్ జగన్ వ్యవసాయ అధికారులతో
మాట్లాడారు. విత్తన సమస్య గురించి చర్చించారు. నాసిరకం విత్తనాల వల్లే రైతులకు ఈ
దుస్థితి ఏర్పడిందని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రైతులకు విత్తనాలు
సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నాసిరకం విత్తనాలు ప్రభుత్వమే దగ్గరుండి సప్లయి
చేస్తుందంటే సిగ్గుతో తల ఒంచుకోవాలని అన్నారు.  ప్రభుత్వం వెంటనే స్పందించి   రైతులకు
వేరుశెనగ విత్తనాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అన్నదాతకు అన్ని విధాలా అండగా
ఉంటామన్నారు. ఆ తర్వాత వైయస్ జగన్ నేరుగా  జిల్లా కలెక్టర్‑కు ఫోన్‑ చేసి రైతులకు
విత్తనాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమస్యను వివరించి వెంటనే పరిష్కారానికి చొరవ
చూపాలని సూచించారు.

 

Back to Top