బాధితులకు అండగా జననేతదివీస్ వ్యతిరేక పోరాటానికి మద్దతురేపు దివీస్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనతూర్పుగోదావరిః ప్రజావ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తున్న చంద్రబాబు సర్కార్ పై ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ రాజీలేని పోరాటం కొనసాగిస్తున్నారు. ఎక్కడ ఎవరికి ఏ ఆపద వాటిల్లినా నేనున్నానంటూ బాధితులకు అండగా నిలుస్తున్నారు. బాధిత ప్రజల పక్షాన నిరంకుశ ప్రభుత్వంపై న్యాయపోరాటం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి మద్దతు తెలిపేందుకు ఈనెల 22న(మంగళవారం) దివీప్ పరిశ్రమ ప్రభావిత ప్రాంతాల్లో వైయస్ జగన్ పర్యటించనున్నారు.
మంగళవారం మధ్యాహ్నం వైయస్ జగన్ మధురపూడి విమానాశ్రయానికి చేరుకుని హైవే మీదగా పంపాదిపేటకు వెళ్లి అక్కడ దివీస్ ప్రభావిత గ్రామాల బాధితులతో మాట్లాడతారు. అదేరోజు సాయంత్రం తొండంగి మండలం దానవాయపేట శివారు తాటియాకులపాలెం సమీపంలో బీచ్ రోడ్డువద్ద జగన్ బహిరంగ సభ జరగనుంది. కాగా ఆయా గ్రామాల పార్టీ నాయకులు సమావేశాలు నిర్వహించి జగన్ పర్యటనకు, దివీస్ వ్యతిరేక పోరాటానికి మద్దతుగా భారీగా తరలి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే దాడిశెట్టి జగన్ పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
పార్టీ మండల కన్వీనర్ పోతల రమణ, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మోతుకూరి వెంకటేష్‌తో కలిసి ఆయన వల్లూరు, హంసవరం, వి.కొత్తూరు, డి.పోలవరం, చామవరం, రేఖవానిపాలెం, కె.ఒ.మల్లవరం, రాపాక, డి.పోలవరం తదితర గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల ప్రజలకు వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజలు, కార్యకర్తలు రెండేళ్లు ఓపిక పట్టాలని, అధికార పార్టీ ఆగడాలకు కళ్లెం వేసే రోజులు దగ్గరపడ్డాయని దివీస్ బాధితులకు వివరించారు. తప్పుడు కేసులు బనాయించినా భయపడొద్దని, కార్యకర్తలంతా మనో నిబ్బరంతో ముందుకుసాగాలని సూచించారు.