విశాఖకు వైఎస్ జగన్

బ్రాండెక్స్ కార్మికుల ఉద్యమానికి సంఘీభావం
వైఎస్ జగన్ దృష్టికి కార్మికుల సమస్యలు

విశాఖపట్నం:  ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రజాపోరాట యోధుడు వైఎస్ జగన్‌ విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. బ్రాండిక్స్ కార్మికుల ఉద్యమానికి ఆయన సంఘీభావం తెలపనున్నారు. ఈనేపథ్యంలోనే విశాఖకు బయలుదేరి వెళ్లారు. ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఇంటికి చేరుకుంటారు. 

అక్కడ భోజనం అనంతరం బయల్దేరి మధ్యాహ్నం 2 గంటలకు అచ్యుతాపురం చేరుకుంటారు. తొలుత బ్రాండిక్స్ కార్మికులతో ఏర్పాటు చేసిన ముఖాముఖీలో పాల్గొంటారు. వారి కష్టసుఖాలు, సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం కార్మికులనుద్దేశించి మాట్లాడతారు. అక్కడ నుంచి నేరుగా విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకుని సాయంత్రం 5.30 గంటలకు విమానంలో హైదరబాద్ పయనమవుతారు.

సమస్యలు జగన్‌కు చెప్పండి..అసెంబ్లీలో చర్చిస్తారు: ప్రగడ
అచ్యుతాపురం: ఇటీవలే కనీస వేతనాల పెంపు, పీఎఫ్ అమలు డిమాండ్‌తో గత నెల 16 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్న బ్రాండిక్స్ కార్మికులు తమ సమస్యలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకురావాలని వైఎస్సార్‌సీపీ యలమంచలి కో ఆర్డినేటర్ ప్రగడ నాగేశ్వరరావు కార్మికులకు సూచించారు. బ్రాండిక్స్ కంపెనీ ప్రారంభించినప్పటికీ వేతనాలు పెంచకపోవడంతో కార్మికులు ఆర్ధిక ఇబ్బందులతో కొట్టు మిట్టాడుతున్న వైనాన్ని ఇటీవలే తాను హైదరాబాద్‌లో వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు నాగేశ్వర్ రావు తెలిపారు. 

కడుపు మండి కార్మికులు రోడ్డెక్కి ఉద్యమిస్తుంటే ప్రభుత్వం అణిచివేసేందుకు కుట్రలు పన్నుతున్న వైనాన్ని కూడా వివరించానన్నారు. మేడే సందర్భంగా బ్రాండిక్స్ కార్మికుల అంశాన్ని వైఎస్ జగన్ ప్రధానంగా ప్రస్తావించారని ప్రగడ గుర్తు చేశారు. అచ్యుతాపురం రానున్న వైఎస్ జగన్ ఎస్‌ఈజెడ్‌లో పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను, మూతపడిన కారణంగా ఇబ్బందిపడుతున్న కార్మికుల కష్టాలను అడిగి తెలసుకుంటారని చెప్పారు. సెజ్‌కు సంబంధించి అన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావచ్చని కార్మికులకు పిలుపునిచ్చారు.  
Back to Top