కాసేపట్లో విశాఖకు వైఎస్ జగన్

విశాఖపట్నంః విశాఖకు రైల్వే జోన్ సాధనే లక్ష్యంగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ దీక్షపై ప్రభుత్వం కుట్రలకు తెరలేపింది. రాత్రి వేళ పోలీసులను పంపించి బలవంతంగా దీక్షను భగ్నం చేస్తూ...విశాఖ కేజీహెచ్ కు తరలించారు. ఐనా సరే రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అయిన రైల్వే జోన్ కోసం గుడివాడ అమర్నాథ్ ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. అమర్నాథ్ ను పరామర్శించేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విశాఖకు బయలుదేరారు. కాసేపట్లో ఆస్పత్రివద్దకు చేరుకొంటారు.


 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గుడివాడ అమర్‌నాథ్ దీక్షాభగ్నం యత్నాన్ని నిరసిస్తూ  జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. పెందుర్తి అంబేద్కర్ విగ్రహం వద్ద ఇంఛార్జ్ అదీప్ రాజు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనకాపల్లి జాతీయ రహదారిపై కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జ్ బొడ్డేటి ప్రసాద్, విశాఖ టౌన్ కన్వీనర్ జానకీ రామరాజు సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. 

స్టీల్ ప్లాంట్‌లోని పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నేత మస్తానప్ప ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేసి..ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ రైల్వేజోన్ కోసం అమర్‌నాథ్ నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.


Back to Top