నేడు మదనపల్లికి వైయస్ జగన్

► పులివెందుల నుంచి కదిరి మీదుగా రాక
►ఎమ్మెల్యే కుమార్తె వివాహానికి హాజరు

మదనపల్లి (చిత్తూరు జిల్లా) :వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం సాయంత్రం మదనపల్లి రానున్నారు. మదనపల్లి శాసనసభ్యులు డాక్టర్‌ దేశాయ్‌ తిప్పారెడ్డి కుమార్తె కరిష్మా దేశాయ్, వరుడు లక్ష్మీకాంతరెడ్డిలను ఆశీర్వదించనున్నారు. ప్రస్తుతం వైయస్సార్‌ జిల్లా పులివెందులలో ఉన్న వైయస్‌ జగన్‌ సాయంత్రం 3 గంటలకు అనంతపురం జిల్లా కదిరి, నల్లచెరువు, తనపల్లి, ములకలచెరువు మీదగా మదనపల్లి చేరుకుంటారని వైయస్సార్‌సీపీ  నేతలు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా సరిహద్దుల్లో భారీ స్వాగతానికి తంబళ్లపల్లి ఇన్‌చార్జి పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు జిల్లా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, పార్టీ ప్రముఖులు మదనపల్లి బయలుదేరుతున్నారు.
Back to Top