కర్నూలుకు బయలుదేరిన వైయస్ జగన్

వైయస్సార్ జిల్లాః తెలంగాణ అక్రమ ప్రాజెక్ట్ లకు వ్యతిరేకంగా, ఏపీ సర్కార్ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్రతిపక్ష నేత వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ జలదీక్ష చేపడుతున్నారు. దీనిలో భాగంగానే వైయస్ జగన్ కర్నూలు బయల్దేరారు. అంతకుముందు ఆయన  వైయస్సార్ జిల్లా పులివెందుల అమ్మవారి శాలలో ప్రత్యేక పూజలు చేశారు. మూడు రోజుల పాటు కర్నూలులో వైయస్ జగన్ దీక్ష చేయనున్నారు. అదేవిధంగా వైయస్ జగన్ దీక్షకు సంఘీభావంగా ఈనెల 17న అన్ని మండల కేంద్రాలలో పార్టీ శ్రేణులు దీక్షలు చేపట్టనున్నాయి.


Back to Top