తూర్పుగోదావ‌రి జిల్లాలో వైయ‌స్ జ‌గ‌న్‌

రాజ‌మండ్రి)) ప్ర‌తిప‌క్ష నేత‌, వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ ఈరోజు తూర్పుగోదావ‌రి జిల్లాలో పర్య‌టిస్తున్నారు. హైద‌రాబాద్ నుంచి నేరుగా రాజ‌మండ్రికి చేరుకొంటున్న వైయస్ జగన్ అక్క‌డ నుంచి అమ‌లాపురం చేరుకున్నారు. అక్క‌డ‌ కోనసీమ పరిధిలోని ఉప్పలగుప్తం మండలం సూదాపాలెం లో ఇటీవల గోవధకు పాల్పడ్డారన్న అపోహతో కొందరు వ్యక్తులు చ‌ర్మ‌కారుల‌పై దాడి చేసి గాయ‌ప‌రిచిన ఘ‌ట‌న తెలిసిందే.  అమలాపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జగన్‌ పరామర్శిస్తున్నారు. సాయంత్రం తిరిగి హైదరాబాద్ కు ప్రయాణం అవుతారు.

తాజా ఫోటోలు

Back to Top