చిత్తూరుకు వైయస్ జగన్..ఏర్పేడు బాధితులకు పరామర్శ

హైదరాబాద్: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదివారం చిత్తూరు వెళ్లనున్నారు. ఏర్పేడు ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలను, గాయపడిన వారిని వైయస్ జగన్ పరామర్శిస్తారు. 

ఇసుక అక్రమ దందాను ఆపివేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ఏర్పేడు పోలీసు స్టేషన్ వద్ద ధర్నా చేస్తున్న గ్రామస్తులపైకి లారీ దూసుకెళ్లిన ఘటనలో 15 మంది దుర్మరణం చెందగా, మరో 15 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. క్షతగాత్రులు రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Back to Top