రాష్ట్ర స‌మ‌గ్ర అభివృద్ధే వైయ‌స్ జ‌గ‌న్ ల‌క్ష్యం

చంద్రబాబు మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్య‌మానికి తెరలేపుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అనుమానం వ్యక్తం చేశారు. కేవలం అమరావతికే అభివృద్ధిని పరిమితం చేస్తూ వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు అన్యాయం చేస్తున్నాడని మండిపడ్డారు. విశాఖ కేంద్రంగా హామీ ఇచ్చిన రైల్వేజోన్‌ను విజయవాడకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా సమగ్రంగా అభివృద్ధి చేయడం అంటే అని ప్రశ్నించారు. అందినకాడికి అప్పులు తెచ్చుకుంటూ ప్రజలపై భారాన్ని మోపుతున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చంద్రబాబు పరిపాలన చేస్తున్నారన్నారు. మన హక్కులను హరించే పార్టీలపై మనం అధారపడాల్సిన అవసరం లేదని, వాటి సాధన కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ముందుంటుందని విశాఖ ప్రజలకు భరోసా కల్పించారు. రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలనేది వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యమని చెప్పారు. ప్రతిపక్షం గొంతు నొక్కే పరిపాలన రాష్ట్రంలో కొనసాగుతోందని, ప్రతిపక్షనేత అసెంబ్లీలో మాట్లాడితే భయపడే పరిస్థితికి చంద్రబాబు దిగజారిపోయారన్నారు. విభజన హక్కుల కోసం వైయస్‌ జగన్‌ ఎంత వరకైనా పోరాటం చేస్తారని, అంతిమంగా రాష్ట్ర అభివృద్ధి వైయస్‌ఆర్‌ సీపీ లక్ష్యమని చెప్పారు. 

Back to Top