అసెంబ్లీలో వైయస్‌ జగన్‌ గొంతు నొక్కారు

అనంతపురం:  ప్రభుత్వ పథకాలు సామాన్యులకు అందడం లేదని మాజీ ఎంపి అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. వైయస్ ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రోలో భాగంగా గుత్తిలో టౌన్ లో సోమవారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. పాదయాత్రలో   రైతులు పడుతున్న అవస్థలు వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకొస్తున్నారు. అనేకమైన సమస్యలు చూస్తున్నయనీ, నాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హంద్రీనీవా ప్రాజెక్టును 70 శాతం పూర్తి చేశారన్నారు. 2012 నుంచి దాదాపుగా 35 టీఎంసీల నీటిని తీసుకొచ్చారన్నారు. ఇప్పుడు కనీసం 35 ఎకరాలకు కూడా చంద్రబాబు నీరివ్వడం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక వర్షాలు కూడా కురవడం లేదన్నారు. గత ఏడాది రెయిన్‌గన్స్‌ పెట్టి 30 ఎకరాలకు కూడా నీరివ్వలేకపోయారన్నారు. 

ఇన్సురెన్సూ, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడం లేదన్నారు. టీడీపీ కార్యకర్తలకే పింఛన్‌లు అందుతున్నాయన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల సమస్యలపై అసెంబ్లీలో మన నాయకుడు వైయస్‌ జగన్‌ ప్రసంగించేందుకు వెళ్లగా టీడీపీ నేతలు గొంతు నొక్కారన్నారు. దుర్భాషలాడారని, ప్రజల కోసం వాటన్నింటిని వైయస్‌ జగన్‌ భరించారన్నారు.

 వైటీ చెరువు, పాతకోట చెరువు, గుత్తి చెరువులకు ఆయకట్టుకు వైయస్‌ రాజశేఖరరెడ్డి నీరిచ్చారన్నారు. ఇప్పుడు మంత్రులుగా ఉన్న పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డిలకు ప్రజల బాధలు పట్టడం లేదన్నారు. అధైర్యపడోద్దు, జిల్లా నుంచి ఇప్పటికే వలసలు వెళ్తున్నారని, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు అరకొరగా పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందాయో, అలాంటి సంక్షేమ పథకాలు మళ్లీ కావాలంటే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలని, వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలన్నారు. అనంతపురం జిల్లాలో కరువు పోవాలంటే వైయస్‌ జగన్‌ సీఎం కావాలన్నారు. తాటాకు చప్పుళ్లకు ఎవరు భయపడోద్దని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. వైయస్‌ఆర్‌ ఎలాగు జిల్లాను ఆదుకున్నారో, అంతకంటే ఎక్కువగా వైయస్‌జగన్‌ ఆదుకుంటారన్నారు.

Back to Top