ఎత్తుగా.. లావుగా ఉంటె మైకిస్తారా?

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో గురువారం రసవత్తర సన్నివేశం జరిగింది. ఎప్పుడూ నోరు వేసుకుని ప్రతిపక్షాన్ని విమర్శించే మంత్రి అచ్చెన్నాయుడి మీద ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంధించిన విమర్శనాస్త్రాలు అందరికీ నవ్వు పుట్టించాయి. వైఎస్ జగన్ వ్యాఖ్యలతో సభ మొత్తం నవ్వులతో నిండిపోయింది. గృహనిర్మాణం గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అడిగిన ప్రశ్నకు తన శాఖతో సంబంధం లేకున్నా.. కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమాధానం చెప్పడంతో.. వైఎస్ జగన్ మండిపడ్డారు.
Back to Top