కుమ్మరి కులస్తుల పట్ల టీడీపీ ప్రభుత్వం చిన్నచూపు..

కుండల తయారీ విధానాన్ని పరిశీలించిన ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌
విజయనగరంః ప్రభుత్వం నుంచి ప్రోత్సహం అందడంలేదని కుమ్మరి కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.రంగరాయపురంలో వైయస్‌ జగన్‌కు తమ  సమస్యలు చెప్పుకున్నారు.వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దగ్గరుండి కుండల తయారీ విధానాన్ని పరిశీలించి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా కుమ్మరి కులస్తులు కుండల తయారీకి మట్టి కూడా లభించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేక వలసవెళ్తున్నామన్నారు. ట్రాక్టర్‌ మట్టిని  పదిహేను వందల పెట్టి కొనుగోలు చేయాల్సివస్తుందన్నారు. ఇటుకలు, కుండలు తయారీ చేసుకోవడానికి కనీసం 5 ఎకరాలు స్థలం ఇప్పించాలని జగన్‌ను కోరారు. 25 సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, చదువుకున్న యువతకు ఉద్యోగాలు అవకాశాలు లేక కుమ్మరి వృత్తిలో కొనసాగాల్సివస్తుందని వాపోయారు. కుమ్మరి కులస్తులను బిసి(బి)నుంచి బిసి(ఎ) మార్పు చేయాలని కోరారు. కుమ్మరి కులస్తులకు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలోనే మేలు జరిగిందన్నారు. కుమ్మరుల అభివృద్ధికి ఫెడరేషన్‌ ఏర్పాటుచేశారన్నారు. వైయస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించి వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
Back to Top