చంద్రబాబు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారు


–  ప్రబోదానంద ఆశ్రమ భక్తులకు అండగా ఉంటా
– వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ
విశాఖ: రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని, ముఖ్యమంత్రి చంద్రబాబే రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నానని ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మండిపడ్డారు. అనంతపురం జిల్లాలోని శ్రీ ప్రబోదానంద స్వామి ఆశ్రమ భక్తులకు అండగా ఉంటానని ఆయన  హామీ ఇచ్చారు. సోమవారం ప్రజా సంకల్ప యాత్రలో  వైయస్‌ జగన్‌ను అనంతపురం జిల్లాలోని  ప్రభోదానందస్వామి ఆశ్రమ భక్తులు కలిశారు. తమపై జేసీ వర్గీయులు దాడి చేశారని జననేతకు ఫిర్యాదు చేశారు. భక్తులు విశాఖపట్నం వచ్చి ఆశ్రమంపై టీడీపీ నేతలు అనుసరిస్తున్న తీరును ఫిర్యాదు చేస్తున్నారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ ఎంత దయానీయంగా ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. తాడిపత్రిలో ఒక రౌడీ రాజ్యం చెలరేగిపోతుందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చ ంద్రబాబు రౌడీయిజం చేసేవారిని కట్టడి చేయకుండా ప్రోత్సíßస్తున్నారని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దౌర్జన్యంగా ఇసుక తరలిస్తు ప్రశ్నించిన తహశీల్దార్‌ను జుట్టు పట్టుకుని కొట్టారని గుర్తు చేశారు. తాడిపత్రిలో స్వామి ఆశ్రమంలోని చొరబడి భక్తులను, ఆడవాళ్లని కూడా చూడకుండా దాడి చేశారన్నారు. అలాంటి వారికి చంద్రబాబు దగ్గరుండి సపోర్టు చేయడం దారుణమన్నారు. ఇలాంటి సంఘటనలు జరుగకుండా ఉండాలంటే బాధ్యుౖలñ న ఎమ్మెల్యేలు, ఎంపీలను జైల్లో పెట్టి శిక్షించాలన్నారు. ఆశ్రమ  భక్తులకు, స్వామిజీకి వైయస్‌ఆర్‌సీపీ అన్ని రకాలుగా తోడుగా ఉంటుందని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. అన్యాయం అన్నదానికి ఎప్పుడో ఒకరోజు ఫుల్‌ స్టాఫ్‌ పడుతుందని, మంచి జరుగుతుందని జననేత భరోసా కల్పించారు.
 
Back to Top