మనిషి మృగం ఎప్పుడవుతాడంటే..


– ఏ తప్పు చేసినా శిక్షించేవాడు లేకపోతే మృగం అవుతాడు
– మద్యం వల్ల కూడా మనిషి మృగం అవుతాడు
–  బడులు, గుడుల మధ్యే మద్యం షాపులు పెడితే మనిషి మృగం అవుతాడు
– ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు మనిషి మృగం అవుతాడు
– మంత్రులు, ఎమ్మెల్యేలే మహిళల పట్ల వికృతంగా ప్రవర్తిస్తారు
– మహిళా అధికారిపై దాడి చేసినా విచారణ కూడా జరగలేదు
– –రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
– ఒక నెలలోనే 281 అత్యాచార కేసులు నమోదు
– రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని బాబు వెన్నుపోటు పొడిచారు
– అవినీతి, మోసం, అబద్ధాల పాలన రాష్ట్రంలో సాగుతోంది
– ప్రతి ఏటా చంద్రబాబుకు ఉత్తమ విలన్‌ అవార్డు ఇవ్వవచ్చు
– ఆరోగ్యశ్రీని టీడీపీ ప్రభుత్వం నీరుగార్చింది
– పిల్లలు చదువులు మానేస్తున్న అధ్వాన పరిస్థితి ఉంది
–  ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చంద్రబాబు నిర్వీర్యం చేశారు
– చదువుల కోసం ఎన్ని లక్షలు ఖర్చైనా ఫర్వాలేదు..నేను భరిస్తా
– హాస్టల్‌ ఖర్చులకు ప్రతి ఏటా రూ. 20 వేలు
– పిల్లలను బడికి పంపిస్తే రూ.15 వేలు ఇస్తాం
– అవ్వతాతల పింఛన్‌ రూ. 2 వేలకు పెంచుతా
– 45 ఏళ్లకే మహిళలకు పింఛన్లు 

కృష్ణా జిల్లా: రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అరాచకాలపై వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మనిషి మృగంలా మారుతున్నాడని ధ్వజమెత్తారు. ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలే అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కృష్ణా జిల్లా పెడన పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..వైయస్‌ జగన్‌ మాటల్లోనే..

– గత రెండు రోజులుగా పేపర్లలో ఓ ఘటన కనిపిస్తోంది. ఇటువంటి ఘటనలు సర్వసాధారణంగా జరుగుతున్నాయి. అక్కచెల్లెమ్మలను గౌరవించాల్సిన ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా మహిళలపై, చిన్న పిల్లలపై మనుషులు మృగాలుగా ప్రవర్తిస్తున్నారు. ఈ నెలలోనే 11 కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలు నిజంగా బాధనిపించింది.
– నాలుగేళ్ల క్రితం చంద్రబాబు టీవీలలో విఫరీతమైన ప్రచారం చేశారు. ఆయనొస్తే చాలా బాగుటుందని ఊదరగొట్టారు. ఆడపిల్లలను బయటకు పంపించాలంటే భయం వేస్తుందట. ఆయన వస్తే బాగుంటుందని అడ్వర్‌టైజ్‌మెంట్లు చూశాం.
– మొన్న ఉప్పుచర్లలో, నిన్న గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఓ ఘటన, గుంటూరు జిల్లాలోనే 11 కేసులు. మహిళలపై అత్యాచార కేసులు. మనిషి మృగంలా ఎందుకు మారుతున్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయంటే..తాను తప్పు చేసినా అడిగే ధైర్యం ఎవరికి లేదని, ప్రభుత్వం తనకు తోడుగా ఉంటుందని, తనను ఏమీ చేయలేరని మనిషి బరితెగించినప్పుడు మనిషి మృగమవుతాడు.  అధికారంలో ఉన్నవారు తప్పుచేసిన వారికి సపోర్టు చేయడంతో మనిషి మృగమవుతున్నాడు. మీరు అవినీతి చేసుకోండి..అడ్డంగా సంపాదించుకోండి..నాకు కొంత ఇవ్వండని అధికారంలో ఉన్నవారు ప్రోత్సహిస్తే..మనిషి మృగమవుతాడు. ఎప్పుడైతే ప్రజల చేత ఎన్నుకోబడ్డ పంచాయతీ వ్యవస్థను నీరుగార్చి ..జన్మభూమి కమిటీల పేరుతో ముఠాలు ఏర్పాటు చేస్తే మృగంలా మారుతారు. మద్యం నిషేదించాల్సింది పోయి మన ఇంటి పక్కనే గుడి పక్కనే మద్యం షాపులు పెడితే అప్పుడు మనిషి మృగమవుతాడు. దేశంలో మహిళలపై వేధింపుల కేసుల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన ఐదు మంత్రుల పేర్లు ఉంటే..అందులో ఏపీకి చెందిన ఇద్దరు మన రాష్ట్ర కేబినెట్‌లో ఉన్నారు. వాళ్లని ముఖ్యమంత్రి సపోర్టు చేస్తే మనిషి మృగమవుతారు. 
– వనజాక్షి వంటి మహిళా అధికారిణి తన డ్యూటీ చేస్తుంటే అధికార పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ఆ మహిళా అధికారిణిని జుట్టుపట్టుకొని ఈడ్చుకెళ్లినా ఆ ఎమ్మెల్యేపై కేసు పెట్టకపోతే మనిషి మృగాలు కాక ఏమవుతారు.
– రిషితేశ్వరి అనే అమ్మాయి ర్యాగింగ్‌ భరించలేక ఆత్మహత్య చేసుకుంటే..ప్రిన్సిపాల్‌ను వెనుకేసుకొచ్చిన సీఎం తీరు చూస్తే మృగాలు కాక ఏమవుతారు. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ కేసులో టీడీపీ నేతలు, వారి బంధువులు ఉంటే వ ఆరికి చంద్రబాబు సపోర్టుగా నిలిచారు. 
– ఎప్పుడైతే ముఖ్యమంత్రి నోట్లో నుంచి కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని వెకిలి నవ్వుతో చంద్రబాబు అంటే మనిషి మృగాలు కాక ఏమవుతారు.
– నాలుగేళ్లుగా మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతే 240 మంది ఆడపడుచులపై లైంగిక దాడులు జరిగినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనిషి మృగం కాడా?
– ఇదే ముఖ్యమంత్రి ఎన్నికలు వస్తున్నాయని ఎదుటి వ్యక్తులపై ఆరోపణలు చేయడం, డ్రామాలు ఆడుతున్నారు. ఇదే పెద్ద మనిషఙ చంద్రబాబు పాలన చూసినప్పుడు తిలక్‌ గారి మాటలు గుర్తుకు వస్తాయి..‘‘గజానికో గాంధారి పుత్రుడు ’’ అన్నది ఈ రాష్ట్రంలో కనిపిస్తోంది. చంద్రబాబు పాలనలో అన్యాయం, అవినీతి, అధర్మం, మోసాలు జరుగుతున్నాయి. నాలుగేళ్ల పాలనను గమనించమని కోరుతున్నాను.
– మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయి కాబట్టి ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాను. రుణాల మాఫీ పేరుతో రైతులను, అక్కచెల్లెమ్మలను అడ్డగోలుగా మోసం చేశారు. బాబు వస్తే జాబు ఇస్తానని, రాకపోతే నెల నెల రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని అడ్డంగా మోసం చేశారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని రైతులను మోసం చేశారు. తానే ఒక దళారి అయి రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి అదే హెరిటేజ్‌ సంస్థలో అధిక రేట్లకు అమ్ముకుంటున్నారు. 
– ఎన్నికల ప్రణాళికలోని ప్రతి పేజీలో ఒ క కులాన్ని, వర్గాన్ని మోసం చేశారు. నాలుగేళ్లుగా చంద్రబాబు పాలనలో పలాని వ్యక్తిని మోసం చేయలేదు అని చెప్పుకోవడానికి ఒక్కరూ లేరు. ఆ రోజు ఎన్నికల సమయంలో పేదవాడికి 3 సెంట్ల స్థలం ఇస్తామన్నారు. నాలుగేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు.
– ఎన్నికలప్పుడు బీసీలపై ప్రేమ అని చంద్రబాబు డ్రామాలాడుతున్నారు. నాలుగు కత్తెర్లు ఇస్తే బీసీలపై ప్రేమ ఉన్నట్లా? ఇంజినీరింగ్‌ ఫీజులు లక్షల్లో ఉంటే రూ.30 వేలు ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీని పూర్తిగా నీరుగార్చారు. 108 నంబర్‌కు ఫోన్‌ చేస్తే గతంలో ఓ ధీమా ఉండేది. 
– పైన చంద్రబాబు ఇసుక నుంచి మట్టి, కరెంటు కొనుగోలు, బొగ్గు, మద్యం, కాంట్రాక్టర్లు, రాజధాని భూములు, చివరకు గుడి భూములను దోచేస్తున్నారు. కింద జన్మభూమి కమిటీల పేరుతో తన మాఫియాకు అప్పగించారు. పింఛన్లు, రేషన్‌కార్డులు కావలన్నా లంచాలే. చివరకు మరుగుదొడ్డి కావాలన్నాలంచాలే. 
– సినిమాలలో చంద్రబాబు నటించి ఉంటే మాత్రం ప్రతి సంవత్సరం ఉత్తమ విలన్‌ అనే అవార్డు ఆయనకే దక్కేది. 
– పెడన నియోజకవర్గంలో నాలుగేళ్లుగా ఏం జరుగుతోందో ఆలోచించండి. ఇక్కడి రైతుల పరిస్థితి, వారి సమస్యలు వింటుంటే ఒక సామెత గుర్తుకు వస్తుంది. అమ్మకు అన్నం పెట్టని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తాడట. కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వలేని ముఖ్యమంత్రి రాయలసీమకు నీరు ఇచ్చి సస్యశ్యామలం చేశానని చెప్పుకుంటున్నారు. ఇదే రైతుల తరఫున చంద్రబాబును అడుగుతున్నాను. ఆవనిగడ్డ, పెడన ప్రాంతాల్లో నాలుగేళ్లుగా పంటల పరిస్థితి ఏంటి? ఇవాళ రైతులు కాల్వ నీటితో పంటలు వేసుకునే పరిస్థితి లేదు. రెండు పంటలు పండే ఈ ప్రాంతం నాలుగేళ్లుగా బీళ్లుగా మారాయి. మహానేత పాలనలో రెండు పంటలకు నీళ్లు అందేవని రైతులు చెబుతున్నారు. ఒకవైపు పట్టిసీమతో సస్యశ్యామలం అంటున్నారు. నిజంగా పట్టీసిమ కట్టి ఉంటే మా పరిస్థితి ఇలా ఎందుకు ఉంటుందని రైతులు ప్రశ్నిస్తున్నారు.
– పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీల నీరు నిల్వ చేసుకోవచ్చు. నాన్నగారి హయాంలో దాదాపుగా పూర్తి అయ్యింది. ఆర్‌ అండ్‌ అర్‌ ప్యాకేజీ కింద తెలంగాణ ప్రభుత్వానికి రూ.144 కోట్లు చెల్లించి ఉంటే ఈ ప్రాంతం సస్యశ్యామలం అయ్యేది. రైతులు అవస్థలు పడుతున్నారు. నీరేమో సముద్రంలో కలిసిపోతోంది.
– చివరి ఆయకట్టుకు నీరిచ్చేందుకు ఉద్దేశించి చేపట్టిన పనులు ఎందుకు ముందుకు సాగడం లేదు. మట్లం వద్ద కొల్లేరు నీటిని ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి ఉంటే ఈ ప్రాంతం సస్యశ్యామలం అయ్యేది. 
– నాలుగేళ్లలో ఏ ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా?  చేపలకు, రొయ్యలకు కూడా గిట్టుబాటు ధరలు లేవు. రైతులు నావద్దకు వచ్చి అన్నా..రైతులే కాదు..అక్వా రైతులకు కూడా గిట్టుబాటు ధర లేదని చెప్పారు. 
– వ్యవసాయం 14 శాతం అభివృద్ధితో పరుగులు తీస్తుందని చంద్రబాబు అంటున్నారు. మీ ఆదాయం నిరుడి కంటే ఈ ఏడాది 14 శాతం పెరిగాయా బాబూ? అసలు చంద్రబాబు మనిషేనా? పెడనలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మూడు రోజులకోసారి నీరు ఇస్తున్నారు. సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు కట్టండి అని ప్రజలు అడుగుతుంటే కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. 20 లీటర్ల క్యాన్లు రూ.40 చొప్పున కొంటున్నారు.
– మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పెడనలో 8 కాలనీలు ఏర్పాటు చేసి వేలాది పక్క గృహాలు నిర్మించారు. నాలుగేళ్లుగా చంద్రబాబు ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. 
– ఇక్కడ చేనేతలు, మత్స్యకారులు ఎక్కువగా ఉన్నారు. చేనేతలకు ఎన్నికలప్పుడు చంద్రబాబు చెప్పిన మాటలు ఏంటో తెలుసా? 25 హామీలు ఇచ్చారు. మగ్గం మీద కూర్చోని మంచి ఫోజు కొట్టి తన ప్రణాళికలో పెట్టారు. పిల్లలకు ఉచిత చదువుట. రూ.1.50 లక్షలతో ఇల్లు, షెడ్డు అన్నారు. తక్కువ వడ్డీతో రుణాలు అన్నారు. ఏటా రూ.1000 కోట్లు చేనేతలకు అన్నారు. చేనేత రుణాలు మాఫీ అన్నారు. ఇలాంటివి ఎన్నేన్నో..చంద్రబాబు పుణ్యమా అంటూ గతంలో సబ్సిడీ వచ్చేది. ఇవాళ సబ్సిడీ కూడా అందడం లేదు. 
–కళాంకారి వృత్తికి పెడన ఫేమస్‌. శ్రీకాళహస్తి తరువాత పెడన గుర్తుకు వస్తుంది. ఇక్కడి కళాంకారి వృత్తుల అక్కచెల్లెమ్మలు పస్తులు ఉంటున్నారు. మత్స్యకారులు నా వద్దకు వచ్చి అన్నా..ఎన్నికలప్పుడు చంద్రబాబుఅవి  చేస్తాం..ఇవి చేస్తామన్నారు. ఎస్సీలుగా చేస్తామన్నారు. ఈ హామీలను అడిగితే ఇదే పెద్ద మనిషి తాట తీస్తామని బెదిరించారు. అన్యాయంగా బతుకుతున్నామని మత్స్యకారులు అంటున్నారు. ఫిస్సింగ్‌ హాలీడేఅంటూ మమ్మల్ని సముద్రంలోకి పంపించడం లేదు అ ంటున్నారు. ఒక్కసారి సముద్రంలోకి వెళ్తే తిరిగి వస్తామో లేదో తెలియని పరిస్థితి ఉందన్నా అంటున్నారు. కొత్త బోట్లు కొనుగోలు చేసినా కూడా వాటికి డీజిల్‌ సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించాల్సింది పోయి ఇవాళ లైసెన్స్‌ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని చెబుతున్నారు.
– ఇలాంటి అన్యాయమైన, అబద్ధపు పాలన చూశారు. ఇలాంటి వ్యక్తిని పొరపాటున క్షమిస్తారా? మోసం చేసే వ్యక్తిని క్షమిస్తే..చంద్రబాబు మీ వద్దకు వచ్చి పెద్ద పెద్ద అబద్ధాలు చెబుతారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు. బంగారానికి బోనస్‌ అంటారు. ప్రతి ఇంటికి కేజీ బంగారంతో పాటు బెంజి కారు కొనిస్తా అంటాడు. నమ్ముతారా? నమ్మరు కాబట్టి ప్రతి ఇంటికి చంద్రబాబు తన మనిషిని పంపించి రూ.3 వేలు చేతిలో పెడతారు. డబ్బులు మాత్రం వద్దు అనకండి. రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనదే.. మన జేబుల్లో నుంచి లాక్కున్నదే. ఓటు వేసే సమయంలో మాత్రం మీ మనసాక్షి ప్రకారం వేయండి. అబద్ధాలు చెప్పే వారు..మోసం చేసేవారిని బంగాళఖాతంలో కలపండి. 
– చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను మార్చేందుకు పాదయాత్రగా బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించండి. అప్పుడే ఈ చెడిపోయిన వ్యవస్థలోకి నిజాయితీ, విశ్వసనీయత అనే పదానికి అర్థం వస్తుంది. 

–రేపు పొద్దున దేవుడు ఆశీర్వదించి, మీ అందరి దీవెనలతో మనం ఏం చేస్తామన్నది నవరత్నాలు ప్రకటించాం. ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడాలని ఈ నవరత్నాలు ప్రకటించాం. ఈ సభలో నవరత్నాల్లో నుంచి పేద వాడి చదువుల కోసం ఏం చేస్తామన్నది చెబుతున్నాను.
– మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మీ పిల్లలను ఏం చదివిస్తారో చదివించండి..ఎన్ని లక్షలు ఖర్చైనా నేను భరిస్తాను. అంతేకాదు..నాన్నగారు పేదవారి కోసం ఒక్క అడుగు ముందుకు వేస్తే..నాన్నగారి కొడుకుగా జగన్‌ అనే నేను రెండు అడుగులు ముందుకు వేస్తాను. హాస్టల్‌లో ఉండి చదివేపిల్లలకు ప్రతి ఏడాది హాస్టల్‌ ఖర్చులు, మెస్‌ చార్జీల కోసం ఏడాదికి రూ.20 వేలు చెల్లిస్తాను. మీ పిల్లలను బడికి పంపిస్తే తల్లి ఖాతలో ప్రతి ఏటా రూ.15 వేలు జమా చేస్తాం. చిట్టి పిల్లలకు మంచి పునాది వేస్తేనే రేపు పొద్దున ఇంజినీర్లు, డాక్టర్లు అవుతారు. అలాగే వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక పింఛన్‌ రూ. 2 వేలకు పెంచుతాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పింఛన్‌ ఇస్తాం. అలాగే పింఛన్‌ వయస్సు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకే తగ్గిస్తాను. చెడిపోయిన ఈ వ్యవస్థను మార్చేందుకు బయలుదేరిన మీ ముద్దుబిడ్డకు తోడుగా ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. 



 
Back to Top