స్పీకర్ విజ్ఞతకే వదిలేస్తున్నా: వైఎస్ జగన్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానిపై చర్చను స్పీకర్ విజ్ఞతకే వదిలేస్తున్నట్లు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రెండోసారి వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే రాజధానిపై చర్చకు అనుమతించాలని ఆయన విజ్ఞప్తి చేయగా అందుకు స్పీకర్ నిరాకరించారు.  కాగా  అంతకు ముందు రాజధాని ప్రాంతంలో బలవంతపు భూ సమీకరణ అంశంపై శాసనసభ దద్దరిల్లింది. ఈ అంశంపై చర్చకు పట్టుబడుతూ వైఎస్ఆర్ సీపీ సభ్యులు సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. దాంతో సభ రెండు సార్లు వాయిదాపడింది.
Back to Top