మానవత్వంలేని ప్రభుత్వం

వైయస్ఆర్ జిల్లా : రాష్ట్ర ప్రభుత్వానికి మానవత్వం లేదని, ప్రజల ఇబ్బందులను పట్టించుకోవడంలేదని ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేయి విరిగి 15 రోజులైనా రేషన్‌కార్డు లేదనే నెపంతో ఆరోగ్యశ్రీకి అవకాశం ఇవ్వడం లేదని బాధితురాలు వైయస్‌ జగన్ కు మొరపెట్టుకున్నారు.  ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై జననేత మండిపడ్డారు. అదేవిధంగా పార్నపల్లె మత్స్యకారులతోపాటు పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకమైకయ్యారు.  రెండు కుటుంబాలను పరామర్శించారు. కడప నగర పర్యటనలో భాగంగా నగరంలోని సన్‌రైజ్‌ ఆస్పత్రిని సందర్శించనున్నారు. అలాగే జెడ్పీ వైస్‌ చైర్మన్‌ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లనున్నారు. ప్రొద్దుటూరులో వివాహ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

Back to Top