పండు ముసలికి పెన్షన్‌ ఇవ్వలేరా
అనంతపురం: వంద సంవత్సరాల పైబడిన వృద్ధుడు పెన్షన్‌ రావడం లేదంటూ వైయస్‌ జగన్‌కు తన ఆవేదనను వ్యక్తం చేశాడు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి చేరిన ప్రజా సంకల్పయాత్రకు చేరుకున్న పకీరప్ప (109) వైయస్‌ జగన్‌ను కలుసుకున్నారు. 5 నెలల నుంచి తనకు పెన్షన్‌ రావడం లేదని, ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా వస్తుందంటున్నారు.. పెన్షన్‌ ఆఫీస్‌కు వెళ్లి అడిగితే రాలేదంటూ వెనక్కి పంపుతున్నారని జననేతకు పకీరప్ప తన బాధను వెల్లబోసుకున్నాడు. నా పెన్షన్‌ కట్‌ చేశారు.. నన్ను మీరే ఆదుకోవాలని పండు ముసలి వైయస్‌ జగన్‌ను వేడుకున్నారు. పెన్షన్‌ అందే విధంగా చర్యలు తీసుకుంటానని, మన ప్రభుత్వం వచ్చిన తరువాత పెన్షన్‌ రూ.2 వేలు చేస్తామని పకీరప్పకు తెలియజేశారు. 
Back to Top