హైదరాబాద్) అసెంబ్లీ లో తెలుగుదేశం నాయకుల తీరుని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తీవ్రంగా తప్పు పట్టారు. గజరాజు వెళుతుంటే కుక్కలు మొరుగుతున్న రీతిన టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో టీడీపీపై అవిశ్వాస తీర్మానం చర్చ సందర్బంగా మాట్లాడుతూ...తన మీద ఏవేవో అభాండాలు వేస్తున్నారని చెప్పారు. పరిటాల రవి హత్య విషయంలో ఆరోపణలు చేస్తున్నారని, కానీ, అటువంటి అంశానికి సంబంధించిన జేసీ దివాకర్ రెడ్డిని ఎందుకు పార్టీ లో చేర్చుకొన్నారని సూటిగా ప్రశ్నించారు. కేసు మీద తీర్పు ఇచ్చేశాక కూడా మాట్లాడుతున్నారని, ఇటువంటి మాటల్ని రికార్డుల నుంచి తొలగించాలన్నారు. <br/>వంగవీటి మోహన రంగా ను చంపించింది చంద్రబాబు నాయుడు అని అప్పటి మంత్రివర్గంలో ఉన్న చేగొండి హర రామజోగయ్య పుస్తకం రాశారని గుర్తు చేశారు. అప్పటి కేసులో ముద్దాయిలుగా ఉన్నవారు ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులుగా అసెంబ్లీలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇప్పడు చంద్రబాబు నుంచి మంత్రుల దాకా అంతా నోరు తెరిస్తే అబద్దాలు ఆడుతున్నారని, అవాస్తవాలు మాట్లాడేందుకు సిగ్గుండాలని నిప్పులు చెరిగారు.