ఖాళీ బిందెలతో వైయస్‌ జగన్‌ నిరసనఅనంతపురం: ఆరు నెలలకు ఒక మారు కూడా తాగునీరు అందడం లేదని సఖినేపల్లి తండా మహిళల వైయస్‌ జగన్‌కు వారి సమస్యను చెప్పుకున్నారు. తాగునీటి కోసం ఖాళీ బిందెలతో వారు నిరసన వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు చేరుకున్న మహిళలు వారి గోడును వైయస్‌ జగన్‌ ముందు వెల్లబోసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే, మున్సిపల్‌ అధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా.. ఎవరూ స్పందించడం లేదని వాపోయారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని వైయస్‌ జగన్‌ వారికి హామీ ఇచ్చారు. అనంతరం మహిళలతో పాటుగా ఖాళీ బిందెలు పట్టుకొని వైయస్‌ జగన్‌ నిరసన వ్యక్తం చేశారు. 
Back to Top