ట్రాన్స్‌కో, జెన్‌కోలో విపరీతమైన దోపిడీ



వందల కోట్లు దోచుకుంటున్న చంద్రబాబు
విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఔట్‌సోర్సింగ్‌లో భారీ స్కాం
ఉద్యోగుల సర్వీస్‌ను బట్టి రెగ్యులరైజ్‌ చేస్తాం
ఫ్రెండ్లీ ఎంప్లయిస్‌ సిస్టమ్‌తో వ్యవస్థను నడిపిస్తాం
విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు న్యాయం చేస్తాం

అనంతపురం: ట్రాన్స్‌కో, జెన్‌కోలో చంద్రబాబు విపరీతమైన స్కాంలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. కార్మికుల పొట్టకొడుతూ.. విచ్చలవిడిగా దోచుకుతింటున్నాడని విమర్శించారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం కుక్కాలపల్లి వద్ద విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యను జననేతకు చెప్పుకున్నారు. అనంతరం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ఉద్యోగుల అనుభవాన్ని బట్టి దశల వారిగా రెగ్యులరైజ్‌ చేస్తానని దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చెప్పారని, ఆయన మరణాంతరం ఎవరూ పట్టించుకోవడం లేదంటే రాజకీయ వ్యవస్థ ఏ విధంగా దిగజారిందో అర్థం చేసుకోవాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి వచ్చేలా పోరాడుదామన్నారు. చంద్రబాబు చర్మం కాస్త మందం కాబట్టి న్యాయం జరగకపోతే ఎవరూ అధైర్యపడొద్దని, ఉద్యోగులకు అన్ని రకాలుగా వైయస్‌ఆర్‌ సీపీ అండగా ఉంటుందన్నారు. ఇంకో సంవత్సరంలో ప్రజల ప్రభుత్వం వస్తుందని, అప్పుడు ఉద్యోగులు అనుభవం, విద్యార్హతను బట్టి అందరినీ రెగ్యులరైజ్‌ చేస్తామని భరోసా ఇచ్చారు. 

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లను ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చి దారుణమైన స్కాం చేస్తున్నారని వైయస్‌ జగన్‌ మండిపడ్డారు. సబ్‌స్టేషన్‌లను ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చే రేట్‌లలో సగం మన కార్మికులను పెట్టి చేయవచ్చన్నారు. అదే విధంగా ఉద్యోగాలను కూడా రెగ్యులరైజ్‌ చేయవచ్చు అన్నారు. చంద్రబాబు చేసే ప్రతి పనిలో దోచుకోవడం తప్ప మరేమీ జరగడం లేదన్నారు. పక్కన తెలంగాణ రాష్ట్రంలో కాస్ట్‌ ఫర్‌ మెగావాట్‌ క్యాపిటల్‌ కాస్ట్‌ కింద రూ. 4.4 కోట్లు వెచ్చిస్తుంటే.. చంద్రబాబు మాత్రం రూ.6.25 కోట్లు వెచ్చిస్తున్నారన్నారు. ప్రతి మెగావాట్‌కు రూ. 1.4 కోట్ల దోపిడీ జరుగుతుందని వైయస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాన్స్‌కో, జెన్‌కో వ్యవస్థలను చంద్రబాబు ఏ విధంగా మోసం చేస్తున్నారో ప్రజలు  అర్థం చేసుకోవాలన్నారు. 

మన ప్రభుత్వం వచ్చిన తరువాత ఫ్రెండ్లీ ఎంప్లయిస్‌ అనే సిస్టమ్‌తో ట్రాన్స్‌కో, జెన్‌కో వ్యవస్థలను నడుపుతామని వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఎవరూ అధైర్యపడొద్దని, అందరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు. అదే విధంగా నష్టాల్లో కొనసాగుతున్న ట్రాన్స్‌కో, జెన్‌కోలను లాభాల బాటలో నడుపుతామన్నారు. 
Back to Top