వైయస్ జగన్ పోరుబాట

-సర్కార్ మొద్దు నిద్ర..కరువుతో రైతన్న విలవిల
-రైతన్నకు అండగా వైయస్ జగన్ పోరాటం
- 27న అనంత కలెక్టరేట్ ఎదుట  ధర్నా
- 28న కర్నూలు జిల్లాలో రైతు భరోసా యాత్ర

ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రజావ్యతిరేక ప్రభుత్వంపై ప్రజల పక్షాన అలుపెరగని పోరాటం కొనసాగిస్తున్నారు. అవినీతి సర్కార్ ను ఎక్కడిక్కడ ఎండగడుతూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో రైతులు కరవు కోరల్లో చిక్కి విలవిల్లాడుతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. ఈక్రమంలోనే నిద్రపోతున్న పచ్చసర్కార్ ను తట్టిలేపేందుకు వైయస్ జగన్ రైతుల పక్షాన పోరాటానికి సన్నద్ధమయ్యారు.

రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే...అవేమీ పట్టని టీడీపీ సర్కార్ దోచుకోవడమే పనిగా పాలన కొనసాగిస్తోంది. కరువు నివారణ కోసం కనీస చర్యలు కూడా తీసుకోకుండా  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ విషయంలో చంద్రబాబు సర్కారు వైఫల్యాలను వైయస్ జగన్ ఎండగట్టనున్నారు. 

రైతు సమస్యలపై స్పందించేలా సర్కారు మెడలు వంచేందుకు వైయస్ జగన్.. ఈ నెల 27 న అనంతపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేయనున్నారు. అనంతరం 28న కర్నూలులో రైతు భరోసా యాత్రను నిర్వహించనున్నారు. కరువు, ఇతర కారణాలతో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను వైయస్ జగన్ పరామర్శించనున్నారు. ఈమేరకు వైయస్సార్ సీపీ జనరల్ సెక్రటరీ తలశిల రఘురాం ఒక ప్రకటన విడుదల చేశారు.

Back to Top