పోరాడుతున్నది వైయస్ జగనే :మాజీ మంత్రి ధర్మాన

కాకినాడ) ప్రత్యేక హోదా
కోసం బాధ్యత తో పోరాడుతున్నది ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్
మాత్రమే అని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మాత్రమే అని
పార్టీ ప్రదాన కార్యదర్శి, మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు అభిప్రాయ పడ్డారు.
తూర్పుగోదావరి జిల్లాకు వైయస్ జగన్ వస్తున్న సందర్భంగా పార్టీ పరిశీలకుని హోదాలో
అక్కడ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న చిల్లర పనులతో
కేంద్రం దగ్గర రాష్ట్రం పరువు పోయిందని ఆయన అన్నారు. రాజధాని ప్రాంతంలో రియల్
ఎస్టేట్ వ్యాపారం చేసుకొనేందుకు ప్రజల ప్రయోజనాలు తన స్వార్థం కోసం తాకట్టు
పెట్టేశారని ఆయన వివరించారు. సిగ్గు లేకుండా ఢిల్లీలో పోరాడాలని ప్రతిపక్షానికి
చంద్రబాబు సూచిస్తున్నారని, అసలు ఢిల్లీలో పోరాడాల్సింది ముఖ్యమంత్రి, ప్రభుత్వం
కాదా అని ఆయన నిలదీశారు. మంత్రి పదవులు, ఇతర తాయిలాల కోసం ఆశ పడి చంద్రబాబు హోదా
విషయం గాలికి వదిలేశారని ఆయన అన్నారు. దీంతో ప్రజల తరపున బాధ్యత తీసుకొని వైయస్
జగన్ పోరాడుతున్నారని ధర్మాన గుర్తు చేశారు. 

To read this article in English:  http://bit.ly/1T2EJP6 


Back to Top