వైయస్‌ జగన్‌ వీరుడు..ధీరుడు..ధీశాలి

కృష్ణా: వైయస్‌ జగన్‌ వీరుడు..ధీరుడు..ధీశాలి అని వైయస్‌ఆర్‌సీపీ నేత జోగి రమేష్‌ అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మైలవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మండుటెండను సైతం నిండు గుండెతో ఎదురించిన, మనందరి అభిమాన నాయకుడు వైయస్‌ జగన్‌ వెంటే ఉంటామని ఇన్ని వేలమంది ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొనడం సంతోషకరమన్నారు. జగనన్నకు తోడుగా ఉండేందుకు వేలాది మంది వేలాది కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వచ్చారన్నారు. కొంత మంది అంటున్నారు..జగనన్న సోనియాను ఎదురించారని, మరికొందరు ప్రధాని మోడీని ఎదురించారని అంటున్నారు. నేను అంటాను మండెటెండను ఎదురించిన నాయకుడు వైయస్‌ జగన్‌ అన్నారు. విలువలు, విశ్వసనీయత కోసం కాంగ్రెస్‌ పార్టీని వీడి బయటకు వచ్చారన్నారు. ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా పోరాడుతూ..కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన వీరుడు..ధీరుడు..ధీశాలి వైయస్‌ జగన్‌ అన్నారు. దేశం మొత్తం కూడా జగనన్న వైపు చూస్తుందన్నారు. నియోజకవర్గంలో ఒక సొల్లుగాడు ఉన్నాడని, మాటలెక్కువ..చేతలు తక్కువ అన్నారు. ఉమా గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోజుకు ఒక ధర్నా చేశారన్నారు. ఇవాళ మంత్రి అయ్యాక ఎన్ని ప్యాకెట్లు వస్తున్నాయో అని లెక్కపెట్టుకుంటున్నారని విమర్శించారు. ఏమయ్యా ఉమా..ఈ రోజు ఒక్క పేదవారికి కూడా ఇల్లు ఇవ్వలేదన్నారు. పోలవరం, పట్టిసీమ ఇలా ప్రాజెక్టులను దోచుకున్నారని విమర్శించారు. ఈ రోజు మంత్రి మాట్లాడారట..జగనన్న విజయవాడ వస్తే కృష్ణమ్మ వారధి ఊగింది. ఈ నాయకుడు అంటున్నాడు..గ్రాఫిక్స్‌ అంటున్నారు. దేవినేని ఉమా కళ్లు లేని కబోదివి నీవు అని మండిపడ్డారు. గ్రాఫిక్స్‌ చేయడం మాకు రాదని, చంద్రబాబుకే అది చెల్లు అన్నారు. మాకు ప్రేమించడం తెలుసు అన్నారు. ఎదుర్కొనే దమ్ము లేక అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన బ్యానర్లు తొలగించి చిల్లర పనులు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. 2018లో పోలవరంలో నీళ్లు నిలబెడతారట. మేం తవ్వించిన కాల్వలో పట్టిసీమ అని చెప్పి రూ.370 కోట్లు దోచుకున్నారని విమర్శించారు. సీబీఐ విచారణ చేపడితే ఉమా జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు. వైయస్‌ జగన్‌కు వస్తున్న ప్రజాధరణ చూసి టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. ఉమా దద్దమ్మ..అసమర్ధుడు అని ఫైర్‌ అయ్యారు. మన నాయకుడు మండు టెండలను సైతం లెక్క చేయకుండా పాదయాత్ర చేస్తూ మైలవరం వచ్చారన్నారు. అన్నా..మాకు రెండు రోజులకే కాళ్లు నొప్పులు ఉన్నాయని, నీవు ఎలా నడుస్తున్నావని అన్నారు. ఇలాంటి నాయకుడు రాష్ట్రానికి దొరకడం అదృష్టమన్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డిని మరిచిపోకూడదని చెప్పారు. దేవినేని ఉమా ఓటుకు రూ.5 వేలు ఇస్తారట..మేం మాత్రం జగనన్న ప్రేమను పంచుతామని చెప్పారు.
Back to Top