నాగలి పట్టిన వైయ‌స్ జ‌గ‌న్‌

నంద్యాలః ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా యాలూరులో  వైయ‌స్ జ‌గ‌న్ నాగ‌లి ప‌ట్టి దుక్కి దున్నారు. నంద్యాల‌లో నాలుగో రోజు రోడ్ షో నిర్వ‌హిస్తున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్ జ‌గ‌న్ యాలూరులో రైతు పొలంలో దిగారు. నాగ‌లి ప‌ట్టి కాసేపు పొలం దున్నారు. 


మ‌న ప్ర‌భుత్వం రాగానే అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ పింఛ‌న్ ఇవ్వ‌డమే కాదు దాన్ని రూ. 2 వేలు చేసి అందిస్తామ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. యాలూరులో వ్య‌వ‌సాయ కూలీల‌తో వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఈ వ‌య‌స్సులో అవ్వ‌లు ప‌నిచేయ‌వ‌ద్ద‌ని, మ‌న ప్ర‌భుత్వం రాగానే రూ. 2 వేలు పెన్ష‌న్ ఇస్తామ‌ని వ‌య‌స్సు మీద‌ప‌డిన కూలీల‌ను ఉద్దేశించి మాట్లాడారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top