బాబుగారి అత్తసొత్తన్నట్లు లాక్కుంటున్నారుః వైయస్ జగన్

అనంతపురంః ప్రతిపక్ష నేత వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోని ఎస్ పీ కుంటలో సోలార్ ప్రాజెక్ట్ నిర్వాసితులకు బాసటగా నిలిచారు. దివంగత ముఖ్యమంత్రి , వైయస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం వైయస్ జగన్ నిర్వాసితులతో ముఖాముఖి నిర్వహించారు. చంద్రబాబు పేదల భూములను తన అత్తగారి సొమ్ములాగా సోలార్ ప్లాంట్ కు ధారాదత్తం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. లక్ష రూపాయలు పరిహారమన్నారు. పైసా ఇవ్వలేదు. ఉద్యోగాలిస్తామని చెప్పి నిరాశే మిగిల్చారు.  పేదలంటే మీకు ఎందుకు అంత కక్ష బాబు అని వైయస్ జగన్ నిలదీశారు. నీళ్లున్న చోట సోలార్ ప్రాజెక్ట్ కట్టడమేంటని ప్రశ్నించారు. బాబు దారుణంగా రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to Top