విద్యార్థుల‌కు వైఎస్ జ‌గ‌న్ బాస‌ట‌

హైదరాబాద్:  విద్యార్థుల‌కు వైఎస్సార్సీపీ బాస‌టగా నిలుస్తుంద‌ని ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ పేర్కొన్నారు. హైద‌ర‌బాద్ , చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల్లో వేల మంది ఏపీ విద్యార్థులు ఇంజ‌నీరింగ్‌, ఇత‌ర ప్రొఫెష‌న‌ల్ కోర్సులు చ‌దువుతున్నారు. చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వం ఈ విద్యార్థుల‌కు కొంత కాలంగా ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ ఎగ్గొడుతోంది. దీంతో ఆయా  విద్యార్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీ విద్యార్థులు వైఎస్ జగన్ను కలిశారు. విద్యార్థులు తమ సమస్యలను వైఎస్ జగన్కు విన్నవించారు. ఫీజులు చెల్లించకపోవడంతో పరీక్షలు రాసేందుకు హైదరాబాద్లోని కాలేజీలు అనుమతించడంలేదని చెప్పారు. విద్యార్థులతో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
 
Back to Top