మక్కా తొక్కిసలాట ఘటనపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి..!

రియాద్ః మక్కాలో తొక్కిసలాట ఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. వారి  ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. పవిత్ర హజ్ యాత్రలో తొక్కిసలాట జరిగి310 మంది చనిపోయారు. వందలాదిమంది తీవ్రంగా గాయపడ్డారు. గంటగంటకు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సైతాన్ ను రాళ్లతో కొట్టేందుకు యాత్రికులు ఒక్కసారిగా ఎగబడడంతో ఈదుర్ఘటన చోటుచేసుకుంది. ఘటనపై సౌదీప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని హాస్పిటల్స్ లో ఎమర్జెన్సీ ప్రకటించింది.మృతుల వివరాలు తెలియలేదు.

15 రోజుల క్రితం మక్కా విస్తరణ పనుల్లో భారీ క్రేన్ కుప్పకూలిన ఘటనలో 107 మంది చనిపోయారు. ఆవిషాద సంఘటన మరువకముందే మరోసారి హజ్ యాత్రలో దారుణం జరిగిపోయింది. కొద్ది రోజుల క్రితం మక్కాలో మరణించిన మచీలపట్నంకు చెందిన అబ్దుల్ ఖాదిర్, ఫాతిమా కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు.
Back to Top