రైలు ప్ర‌మాదంపై వైఎస్ జ‌గ‌న్ దిగ్భ్రాంతి

అనంత‌పురం: అనంత‌పురం జిల్లాలో జ‌రిగిన రైలు ప్ర‌మాదంపై ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జ‌గ‌న్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఈ ప్ర‌మాదంలో చ‌నిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియ చేశారు. ఇటువంటి ఘ‌ట‌నలు పున‌రావృతం కావ‌టంపై విచారం వెలిబుచ్చారు.

అనంత‌పురం జిల్లా పెనుకొండ మండ‌లం మ‌డ‌క‌శిర రైల్వే గేటు ద‌గ్గ‌ర నాందేడ్ ఎక్సు ప్రెస్ ను ఒక గ్రానైట్ లారీ ఢీ కొట్టింది. దీంతో రైలులోని మూడు బోగీలు ప‌ట్టాలు త‌ప్పాయి. గ్రానైట్ రాయి ఏసీ బోగీ మీద ప‌డ‌టంతో మొత్తం బోగీ నుజ్జు నుజ్జు అయింది. ఈ ఘ‌ట‌న‌లో క‌ర్నాట‌కకు చెందిన దేవ్ దుర్గ్ ఎమ్మెల్యే వెంక‌టేష్ నాయ‌క్  తో పాటు రైల్వే ఏసీ టెక్నీషియ‌న్ స‌య్య‌ద్ అహ్మ‌ద్‌, రాయ‌చూర్ కు చెందిన రైతు పుల్లారావు, ప్రైవేటు ఉన్న‌తోద్యోగి వీఎస్‌టీ రాజు, లారీ క్లీన‌ర్ చ‌నిపోయారు. 

అనంత‌పురం జిల్లాలో వ‌రుస‌గా రైలు ప్ర‌మాదాలు జ‌రుగుతుండ‌టంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవ‌ల కాలంలో ఇదే జిల్లాలో మూడు ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం వైపు నుంచి అప్ర‌మ‌త్త‌త క‌ర‌వు అవ‌టంపై విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. సుర‌క్షిత చ‌ర్య‌లు చేప‌ట్టి ప్ర‌జ‌ల మాన ప్రాణాల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌న్న మాట వినిపిస్తోంది. 

అనంత లోనే మూడు రైలు ప్ర‌మాదాలు..!
  • ఒక్క అనంత‌పురం జిల్లాలోనే కొంత కాలం వ్య‌వ‌ధి లో మూడు రైలు ప్ర‌మాదాలు చోటు చేసుకొన్నాయి. అది కూడా ఒక్క నాందేడ్ ఎక్సు ప్రెస్ కు జ‌రిగిన‌వి కావ‌టం గ‌మ‌నార్హం. 
  • 2012 మే లో ఒక ప్ర‌మాదం జ‌రిగింది. హంపి ఎక్సుప్రెస్, నాందేడ్ ఎక్సుప్రెస్ లు రెండూ పెనుగొండ రైల్వేస్టేష‌న్ ను క్రాస్ చేయ‌సే స‌మ‌యంలో స్టాప్ సిగ్న‌ల్ ఉన్న‌ప్ప‌టికీ, హంపి ఎక్సుప్రెస్ వేరే లైన్ లో దూసుకొనిపోయింది. ప‌ట్టాల‌పై నిలిచి ఉన్న గూడ్సు రైలును ఢీకొట్ట‌డంతో 25 మంది మ‌ర‌ణించారు. 
  • 2013 డిసెంబ‌ర్ లో పుట్ట‌ప‌ర్తి సమీపంలోని కొత్త చెరువు ద‌గ్గ‌ర నాందేడ్ ఎక్సు్ప్రెస్ కు మంటలు అంటుకొన్న ఘ‌ట‌న‌లో 26 మంది చ‌నిపోయారు. ఇది అప్ప‌ట్లో చాలా విషాదాన్ని నింపింది. 
  • 2015, ఆగ‌స్టు 24న నాందేడ్ ఎక్సుప్రెస్ ఒక గ్రానైట్ లారీ ఢీ కొట్టిన ఘ‌ట‌న‌లో మ‌రో ప్ర‌మాదం న‌మోదైంది. ఏసీ కోచ్ పూర్తిగా నుజ్జు నుజ్జు కాగా, మూడు బోగీలు ప‌ట్టాలు త‌ప్పాయి. ఈ ఘ‌ట‌న‌లో ఒక ఎమ్మెల్యే స‌హా ఐదుగురు చ‌నిపోయారు. 

Back to Top