విశాఖ జిల్లాలో అడుగుపెట్టిన జ‌న‌నేత‌

- రాజ‌న్న బిడ్డ‌కు ఉత్త‌రాంధ్ర‌లో  ఘ‌న స్వాగ‌తం  
విశాఖ‌: నయవంచనే నైజమైన నికృష్ట పాలనలో.. కమ్ముకున్న కష్టాల కారుచీకటిలో అలమటిస్తున్న జనానికి ఆశల పొద్దుపొడుపులా జననేత తూరుపు సీమలో పాదం మోపి రెండు నెలలు పూర్తి చేసుకొని ఇవాళ ఉత్త‌రాంధ్ర ముఖ‌ద్వార‌మైన విశాఖ జిల్లాలోకి జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్ అడుగుపెట్టారు.  ‘వెతల్లో వెన్నంటి ఉండే నేస్తాన్నవుతా..కన్నీరు తుడిచే హస్తాన్నవుతా..’ అంటూ ఆ అలుపెరగని బాటసారి జిల్లాలో ఏ గడ్డన సాగినా.. అదే అప్యాయ‌త‌, అదే అనురాగం, అదే ప్రేమ‌ను క‌న‌బ‌రుస్తున్నారు. మంగ‌ళ‌వారం ఉద‌యం వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర తుని నియోజ‌క‌వ‌ర్గంలోని కాక‌రాప‌ల్లి నుంచి ప్రారంభం కాగా న‌ర్సీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గంలోని నాత‌వ‌రం మండ‌లం గ‌న్న‌వ‌రం మెట్ట వ‌ద్ద రాజ‌న్న బిడ్డ విశాఖ జిల్లాలోకి అడుగుపెట్టారు. ఈ సంద‌ర్భంగా  ఉత్త‌రాంధ్ర పార్టీ నాయ‌కులు జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.  

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, సీనియ‌ర్ నాయ‌కులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, అమ‌ర్‌నాథ్‌, మాడుగుల ఎమ్మెల్యే, శాసనసభ పక్ష ఉపనేత బూడి ముత్యాలనాయుడు, నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, విశాఖ, అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లాల అధ్యక్షులు తైనాల విజయకుమార్, అనకాపల్లి పార్లమెంట్‌ కో ఆర్డినేటర్‌ వరుదు కల్యాణి, సమన్వయకర్తలు వంశీకృష్ణ శ్రీనివాస్, కోలా గురువులు, కేకే రాజు, తిప్పల నాగిరెడ్డి, అక్కరమాని విజయనిర్మల, అదీప్‌రాజు, కరణం ధర్మశ్రీ, జోగినాయుడు, చెట్టి పాల్గుణ, భాగ్యలక్ష్మి,  చిక్కాల రామారావు, అదనపు కార్యదర్శులు పక్కి దివాకర్, జి.రవిరెడ్డి, విశాఖ పార్లమెంట్‌ మహిళా అధ్యక్షురాలు పీలా వెంకటలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి సనపల చంద్రమౌళి, నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరి, నగర యువజన విభాగం అధ్యక్షుడు కొండా రాజీవ్‌ గాంధీ, రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి తుల్లి చంద్రశేఖర్‌ యాదవ్, రాష్ట్ర మహిళా విభాగం అధికార ప్రతినిధి యువశ్రీ, అక్కరమాని వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అపూర్వ స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు, భారీగా ప్రజలు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు తరలి రావ‌డంతో గ‌న్న‌వ‌రం మెట్ట వ‌ద్ద పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. 

Back to Top