విశాఖ‌లోకి వైయ‌స్ జ‌గ‌న్‌

విశాఖ‌: ప‌్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌య్యేందుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర కొద్ది సేప‌టి క్రితం ఉక్కు న‌గ‌ర‌మైన విశాఖ‌లోకి ప్ర‌వేశించింది. కొత్త‌పాలెం వ‌ద్ద జ‌న‌నేత న‌గ‌రంలోకి అడుగుపెట్టారు. అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హుబ‌లి షెట్టింగ్స్ అదిరిపోయింది. విశాఖ న‌గ‌ర వాసులు పూల‌వ‌ర్షం కురిపించి రాజ‌న్న బిడ్డ‌కు ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు.  257వ రోజు పాదయాత్ర పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండల పరిధిలోని గ్రామాల్లో పాద‌యాత్ర పూర్తి చేసుకొని విశాఖ పశ్చిమ నియోజక వర్గంలోకి ప్ర‌వేశించింది. కొత్తపాలెం వ‌ద్ద జ‌న‌నేత‌కు స్థానికులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. అక్క‌డి నుంచి భగత్‌సింగ్‌నగర్, కార్వల్‌ నగర్, సాయినగర్, అప్పలనరసయ్యకాలనీ, నాగేంద్రకాలనీ, గణపతినగర్, శ్రీరామ్‌నగర్‌ల మీదుగా గోపాలపట్నం జెడ్పీ హైస్కూల్‌ వరకు రోజు పాద‌యాత్ర సాగనుంది. 
Back to Top