పాయ‌క‌రావుపేట‌లోకి ప్ర‌వేశించిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌

- వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం 
- సాయంత్రం  కోట ఉరట్లలో బ‌హిరంగ స‌భ‌

విశాఖపట్నం :  ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర విశాఖ‌ప‌ట్నం జి ల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. పాద‌యాత్ర 241వ రోజు నర్సీపట్నం నియోజకవర్గ శివారు గ్రామమైన ధర్మసాగరం క్రాస్‌రోడ్డు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి యండవల్లి మీదుగా పాయ‌క‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌వేశించారు. ఇవాళ‌ జల్లూరు, పాత తంగేడు, తంగేడు క్రాస్‌ రోడ్‌ మీదుగా కోట ఉరట్ల, కైలాసపట్నం వరకు పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం కోట ఉర‌ట్లలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ‌స‌భ‌లో జ‌న‌నేత పాల్గొని ప్ర‌సంగిస్తారు. 

వ‌ర్షంలోనే పాద‌యాత్ర‌
ఒక‌వైపు జోరువాన కురుస్తున్నా..జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. పాయ‌క‌రావుపేట‌లో ప్ర‌వేశించిన వైయ‌స్ జ‌గ‌న్‌కు స్థానికులు, పార్టీ నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.  పాదయాత్రకు జనం పోటెత్తుతూనే ఉన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని..  భరోసా నింపేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొక్క‌వోని దీక్ష‌తో ముందుకు సాగుతున్నారు. దారిపొడవునా ప్రజలతో మమేకం అవుతూ.. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు జననేత. 
Back to Top