జన ప్రభంజనం

– గజపతినగరంలోకి ప్రవేశంచిన ప్రజా సంకల్ప యాత్ర
– జననేత వైయస్‌ జగన్‌కు ఘన స్వాగతం
– జనసంద్రమైన కొత్తవలస– విజయనగరం రోడ్డు

విజయనగరం: రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరంలో అనంతవాహినిలా సాగిపోతోంది. కొద్దిసేపటిక్రితం వైయస్‌ జగన్‌ పాదయాత్ర గజపతినగరం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ, అప్పలనర్సయ్య, పలువురు నేతలు వైయస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. రాజన్న బిడ్డ రాకతో కొత్త వలస– విజయనగరం రోడ్డు జనసంద్రంగా మారింది. 

శనివారం ఉదయం జననేత 273వ రోజు పాదయాత్రను లక్కవరపు కోట మండలం కిర్లా నుంచి ప్రారంభించారు. జామి మండలంలోని జిడ్డేటివలస క్రాస్‌,  గొడికొమ్ము, అలమండ క్రాస్‌, మీదుగా అలమండ సంత వ‌ద్ద  గణపతినగరం నియోజకవర్గ పరిధిలోకి అడుగుపెట్టారు. అక్క‌డి నుంచి లొట్టపల్లి క్రాస్‌, యాతపాలెం, కొత్త భీమసింగి, పాత భీమసింగి వరకు నేటి ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది.  అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం. దారి పొడవునా మంగళహారతులు. ప్రజా సమస్యల తోరణాలు, వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర  ప్రారంభమైంది. నైట్‌క్యాంప్‌ వద్ద రాజన్న బిడ్డను చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని  పార్టీ శ్రేణుల, ప్రజలు ఉదయం నుంచే పెద్దఎత్తున తరలివచ్చారు.
 
Back to Top