<strong>పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ ఆదేశం</strong>దక్షిణ జిల్లాలను అతలాకుతలం చేస్తున్న వరద పరిస్థితుల మీద ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైెఎస్ జగన్ సమీక్ష జరిపారు. ఈ మేరకు చిత్తూరు, నెల్లూరు జిల్లాల పార్టీ నాయకులతో ఆయన టెలిఫోన్ లో మాట్లాడారు. వరద తీవ్రత, ప్రజల పరిస్థితుల గురించి అడిగి తెలుసుకొన్నారు. ప్రజల్ని ఆదుకొనేందుకు విరివిగా సహాయ చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణుల్ని వైెఎస్ జగన్ ఆదేశించారు.