ఒక్క హామీ అయినా నెరవేర్చారా?

– ముఖ్యమంత్రి అయ్యేందుకు బాబు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు
– రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు ఇలా అందర్ని మోసం చేశారు.
– స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం హోదాలో ఇచ్చిన హామీలకు దిక్కు లేదు
– రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి
– నంద్యాల ఉప ఎన్నికలో మీరు వేసే ఓటు మార్పుకు నాంది కావాలి
–  మూడున్నర సంవత్సరాల కాలంలో బాబు చేసిన మోసాలకు వ్యతిరేకంగా ఓటు వేయండి

నంద్యాల:  ముఖ్యమంత్రి అయ్యేందుకు ఎన్నికల ముందు ^è ంద్రబాబు ఇచ్చినా హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజలను సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో 2014వ సంవత్సరంలో కర్నూలులో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచారని ఆయన మండిపడ్డారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వైయస్‌ జగన్‌ గురువారం పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇవాళ నంద్యాల ఉప ఎన్నికలో  మనం వేసే ఈ ఓటు ఎవర్నో ఒక వ్యక్తిని ఎమ్మెల్యేగా చేసేందుకు కాదన్నారు.  మూడున్నర సంవత్సరాల కాలంలో చంద్రబాబు పనితీరుపై వేసే ఓటుగా భావించాలని వైయస్‌ జగన్‌ సూచించారు. బాబు చేసిన మోసానికి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నామని భావించాలన్నారు. అన్యాయానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని, దుర్మార్గానికి, అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేయాలని వైయస్‌ జగన్‌ సూచించారు. 

ప్రతి ప్రశ్నకు లేదు..లేదు అన్న సమాధానమే
ప్రచారంలో భాగంగా వైయస్‌ జగన్‌ నంద్యాల ప్రజలను చంద్రబాబు హామీలపై కొన్ని ప్రశ్నలు సంధించారు. వీటిలో ప్రతి పశ్నకు లేదు..లేదు అన్న సమాధానమే వచ్చింది.  ఎన్నికలకు ముందు బాబు సీఎం అయ్యేందుకు ఏం మాట్లాడారో మీ అందరికి తెలుసు అన్నారు. ఎన్నికలు అయిపోయిన తరువాత ప్రతి వాగ్ధానానికి వెన్నుపోటు పొడిచింది మీ అందరికీ తెలుసు అని తెలిపారు.  

– ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్, టీడీపీ మంత్రులు ఎప్పుడైనా నంద్యాల నడిరోడ్డుపై కనిపించారా? అంటే ..లేదు, లేదు..అని సమాధానం.
– ఎన్నికలు రాకముందు ప్రతి పేద వాడికి మూడు సెంట్ల స్థలం ఇస్తామన్నారు. పక్కా ఇల్లు కట్టిస్తానన్నాడు. మీకు కనీసం ఒక్క ఇల్లైనా కట్టించాడా?అంటే లేదు..లేదు..అని ప్రజల నుంచి సమాధానం వచ్చింది.
– ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రతి పేద వాడికి వ్యవసాయ భూములు పంచుతానన్నారు. మూడున్నర సంవత్సరాలు అయ్యింది చంద్రబాబు అధికారంలోకి వచ్చి..కనీసం ఒక్క ఎకరం అయినా పంచారా?
– బాబు మూడున్నర సంవత్సరాలుగా సీఎంగా ఉన్నారు. బియ్యం కార్డులు, పింఛన్‌ కార్డులుకానీ ఇచ్చారా? అంటే లేదు అన్న సమాధానం వచ్చింది. నాడు మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 21 వేల పింఛన్లు ఉంటే, చంద్రబాబు వచ్చాక పింఛన్‌ కార్డులు తగ్గుతూ తగ్గుతూ 15 వేలకు వచ్చాయన్నారు. ఇవాళ నంద్యాలలో ఉప ఎన్నిక వచ్చిందని మళ్లీ ఈ పింఛన్లు 21 వేలకు పెంచారని వైయస్‌ జగన్‌ వివరించారు.
–  బాబు ముఖ్యమంత్రి అయ్యేదాకా రేషన్‌ షాపులో బియ్యం, కందిపప్పు, పామాయిల్, గొదుమలు, కిరోసిన్‌ ఇలా 9 రకాల సరుకులు ఇచ్చే వారు. ఇవాళ బియ్యం తప్ప మరేది ఇవ్వడం లేదు. 
– నంద్యాలలో వర్షకాలంలో కాలనీలు మునుగుతున్నాయి. ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో కనీసం ఆ వరదల నుంచి కాపాడేందుకు నంద్యాలకు చంద్రబాబు ఒక్క రూపాయి అయినా ఇచ్చాడా? 
–  బాబు సీఎం కావడం కోసం ఎన్నికలకు తాను ఏమన్నాడు..బెల్ట్‌ షాపులు అన్నీ కూడా రద్దు చేస్తానన్నాడు. ఇవాళ బెల్ట్‌ షాపులు తగ్గాయా అంటే లేదు..లేదు అని సమాధానం. సంవత్సరం సంవత్సరం మందు పెరుగుతోంది. తాగేవాళ్లు పెరుగుతున్నారు. ఇంటిపక్కనే మందు షాపులు తెరుస్తున్నారు. ఫోన్‌ కొడితే ఇంటికే మందు వచ్చే కార్యక్రమం చేపట్టారు.
–రైతులను మోసం చేస్తూ ఎన్నికలకు ముందు బాబు చేసిన వ్యాఖ్యలు ఏంటీ? రుణాలు మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు..బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా? అంటే లేదు..లేదు అని కేకలు పెట్టారు.
– డ్వాక్రా అక్క చెల్లెమ్మలను కూడా బాబు మోసం చేశాడు. రూ.14 వేల కోట్ల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానన్నాడు. ఇవాళ ఒక్క రూపాయి కూడా మాఫీ అయ్యిందా అంటే లేదు లేదు అని మహిళలు చేతులు ఊపారు.
–చదువుకుంటున్న పిల్లలను, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న పిల్లలను కూడా చంద్రబాబు వదిలిపెట్టలేదు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జాబు ఇవ్వలేకపోతే ఇంటింటికి రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఇవాల్టికి 38 నెలలు అయ్యింది. ప్రతి ఇంటికి రూ.76 వేలు బాబు బాకీ పడ్డాడు. 
–ముఖ్యమంత్రి కావడం కోసం ఇదే చంద్రబాబు ప్రత్యేక హోదా సంజీవిని అన్నారు. పదిహేను సంవత్సరాలు తెస్తానన్నారు. మూడున్నరేళ్లు అవుతుంది. హోదా తెచ్చారా? 
–దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టి పేదలు పెద్ద పెద్ద చదువులు చదువుకునేలా పూర్తిగా ఫీజులు చెల్లించారు. మీరు చదవండి..నేను చదివిస్తా అని నాన్నగారు నాడు ఆదుకున్నారు. ఇవాల్టికి కూడా పేదలు నాన్నగారిని తలుచుకుంటున్నారు. ఇవాళ ఇంజనీర్‌ చదవాలంటే లక్షలు ఖర్చు అవుతోంది. ప్రభుత్వం మాత్రం రూ.35 వేలు ఏడాది తరువాత ఇస్తోంది.
–దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందుబాటులోకి తెచ్చారు. నాడు 108 ఫోన్‌ కొడితే 20 నిమిషాల్లో అంబులెన్స్‌ మీ వద్దకు వచ్చేది.  ఇవాళ 108 ఫోన్‌చేసినా వచ్చే పరిస్థితి లేదు. ఆరోగ్య శ్రీ పథకానికి సంబంధించి నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించడం లేదు. కాంక్లీయర్‌ ఇన్‌ప్లాంట్‌ అనే చికిత్స చేయించాలంటే రూ.6 లక్షలు ఖర్చు అవుతుంది. ఇవాళ పిల్లలకు ఇలాంటి చికిత్సలు అందడం లేదు. కిడ్నీ పేషేంట్లు డయాలసీస్‌ కోసం నెలకు రూ.20 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్‌ చేసే పరిస్థితి లేదు. కాన్సర్‌కు కీమో థెరఫీ చేయించడం లేదు.
–ఇటువంటి మోసపూరిత పాలనకు మనం ఓటు వేయగలమా? ఇదే చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం కోసం చెప్పిన వాగ్ధానాల్లో ఒక్కటైనా నెరవేర్చారా? 
– ముఖ్యమంత్రి హోదాలో 2014లో కర్నూలుకు వచ్చిన చంద్రబాబు స్వాతంత్య్ర వేడుకల్లో ఎన్నో హామీలు ఇచ్చారు. కర్నూలును స్మార్ట్‌ సిటీ చేస్తామన్నారు. త్రిపుల్‌ ఐటీ , ఉర్దూ యూనివర్సిటీ, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, ఫుడ్‌ పార్క్, ఆవుకు వద్ద ఇండస్ట్రీ పార్క్, ఆదోనిలో టెక్స్‌టైల్‌ పార్క్, ఇలా ఎన్నో వాగ్ధానాలు చేశారు. వీటిలో కనీసం ఒక్కటైనా చేశారా?. ఇవాళ ఇదే చంద్రబాబు నంద్యాలలో ఉప ఎన్నికలు వచ్చే సరికి ప్రజలు గుర్తుకు వచ్చారు. మళ్లీ అరిగిపోయిన టెప్‌రికార్డు ఆన్‌చేశారు. చెవిలో క్వాలిఫ్లవర్‌ పెట్టడానికి వచ్చారు. రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకురావాలి. అది నంద్యాల నుంచే ప్రారంభం కావాలి. ఎన్నికల సమయంలో ఒక్క మాట చెబితే దాన్ని నెరవేర్చకపోతే ప్రజలు కాలర్‌ పట్టుకుంటారు అన్న భయం రాజకీయ నాయకులకు ఉండాలి. ఇవాళ మీరు వేసే ఓటు చంద్రబాబు పాలన అంతం చేసేందుకు వేస్తున్నారని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గుర్తు చేశారు. ధర్మానికి తోడుగా నిలవాలని, న్యాయానికి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నంద్యాల ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని ఆశీర్వదించాలని వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అభ్యర్థించారు.
Back to Top