మీకు అండగా నేనున్నా

  • టీడీపీని బంగాళాఖాతంలో కలపండి
  • జీవితంలో ఒక్క నిజం చెప్పని వ్యక్తి చంద్రబాబు
  • అబద్ధాలు, మోసాలు, అవినీతితో పాలన సాగిస్తున్నాడు
  • ఎన్నికల హామీలు నెరవేర్చని చంద్రబాబుకు బుద్ధి చెప్పండి
  • వైయస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించండి
  • నంద్యాల, కాకినాడతోనే మార్పు మొదలవ్వాలి
కాకినాడః అబద్ధాలు, మోసాలతో పాలన సాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ కాకినాడ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడని ధ్వజమెత్తారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా వైయస్ జగన్ డెయిరీ ఫాం సెంటర్ లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే....సంవత్సరం తర్వాత కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతుంది. ఇవాళ మనం వేసే ఓటు కార్పొరేటర్లను ఐదేళ్ల పాటు ఎన్నుకునేదానికి వేస్తా ఉన్నాం. ఒక సంవత్సరంలో జరగనున్న కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఈ ప్రభుత్వం మనకు కావాలా వద్దా అన్న నిర్ణయం ప్రజలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం మనకు వద్దు, ఇలాంటి మోసపూరిత పాలన మనకొద్దు.  వైయస్సార్సీపీ అభ్యర్థులకు మద్దతు తెలపండి. ఓ సంవత్సరం  తర్వాత మనందరి పార్టీ అధికారంలోకి వస్తుంది వస్తుంది. అభివృద్ధి కాకినాడలో యుద్ధప్రాతిపదిన జరుగుతుంది. 

ఎన్నికలప్పుడు చంద్రబాబు ఏం మాటలు చెప్పాడు. ఎన్నికలయ్యాక మోసం చేయడం ధర్మమేనా అని నేనడుగుతున్నా. ప్రజలను మోసం చేశాక ఆ మనిషిని నిలదీయకూడదట. నిలదీస్తే కళ్లు పెద్దగా, ఎర్రగా చేసి కేసులు పెట్టమంటడు. నిన్ననే నంద్యాలలో చూశాం. ఎన్నికలయ్యాక నడిరోడ్డుపై తెలుగుదేశం నేతలు కత్తులు, తుపాకులతో ఎలా వీరవిహారం చేశారో చూశాం. వైయస్సార్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకొని తుపాకులతో కాల్చారు. కత్తులు చూపిస్తూ నంద్యాల నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. తుపాకులతో కాల్చినా, కత్తులతో వీరంగమేసినా వారిపై కేసులుండవు. బాధితులపైనే కేసులు పెడుతున్నారు. ఇలాంటి పాలన మనకు కావాలా అని నేనడుగుతున్నా. 

తెలుగుదేశం పార్టీ నేతలే రైళ్లను తగలబెట్టిస్తరు. కేసులు వేరే వాళ్ల మీద పెడతరు. దాన్ని సాకుగా చూపిస్తూ మళ్లీ తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తరు. ఇలాంటి పాలన మనకు కావాలా అని నేనడుగుతున్నా..?బాబూ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది చేయమని నిలదీస్తూ కాపులు నిరాహారదీక్షలు, పాదయాత్రలు చేస్తూ, కంచాలు మోగిస్తే కేసుల మీద కేసులు పెడుతున్నడు. ఇలాంటి పాలన మనకు కావాలా అని నేనడుగుతున్నా. 

చంద్రబాబు పాలనలో లంచాలు పుచ్చుకొని, ఆ లంచాల డబ్బుతో అడ్డగోలుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపులతో 
అడ్డంగా దొరికిపోయినా కేసులుండవు. ఇదే జిల్లాలో చంద్రబాబు తనను హీరోగా చూపించుకునేందుకు షూటింగ్ తీయిస్తూ గోదావరి పుష్కరాల్లో  29మందిన చంపించినా కేసులుండవు. ఇలాంటి పాలన మనకు కావాలా అని అడుగుతున్నా

విశాఖలో వేలకోట్ల భూముల రికార్డులు మాయమైపోతున్నాయి. మాయమైపోయిన వాటిని మంత్రులు తమ పేర రిజిస్ట్రేషన్ చేపించుకుంటున్నారు. ఇలాంటి పాలన మనకు కావాలా..? అని నేనడుగుతున్నా. ఎన్నికలప్పుడు మాటలు చెప్పి మోసం చేసిన చంద్రబాబు పాలన మనకు కావాలా..?బాబు అధికారంలోకి వచ్చాక అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు.  ఇలాంటి దుర్మార్గపు పాలన మాకొద్దు బాబు అని మనం అంటున్నాం. 

నంద్యాలలో వీధి వీధి తిరుగుతూ ఎన్నికలప్పుడు బాబు ఏం చెప్పాడు, ఎలా మోసం చేశాడో చెప్పాం. ఎన్నికలయ్యాక ప్రజలను తను ఏరకంగా
మోసం చేశాడన్నది కాకినాడలో మొదటి మీటింగ్ లో చెప్పాం. ముఖ్యమంత్రి కావడం కోసం ఏం చెప్పారు.  జాబు రావాలంటే బాబు రావాలన్నడు. జాబు ఇవ్వకపోతే నెలకు రూ.2వేలు భృతి ఇస్తామన్నడు. బాబు ముఖ్యమంత్రి అయి 39 నెలలయింది. ప్రతీ
ఇంటికి రూ. 78వేలు బాకీ ఉన్నాడా లేడా..? ఒక్క రూపాయైనా ఇచ్చాడా..? ఇదే చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందు రేషన్ షాపులకు 
పోతే బియ్యం, కిరోసిన్, చక్కెర, గోధుమ పిండి, పామాయిల్ ఇచ్చేవాళ్లు. ఇవాళ బాబు ముఖ్యమంత్రి అయ్యాక రేషన్ షాపుకు పోతే బియ్యం తప్ప ఏమైనా ఇస్తున్నాడా..? లేదు.  ఇది మోసం కాదా అని అడుగుతున్నా. ఇచ్చే బియ్యంలో కూడ అవ్వతాతలకు  రెండు కేజీలు ఎక్కువ ఇవ్వాల్సిందిపోయి ఉన్నవి కూడ తీసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు.

బాబు ముఖ్యమంత్రి కావడానికి, అధికారంలోకి రావడం కోసం అక్కచెల్లెమ్మలకు ఏం చెప్పాడు.  బెల్ట్ షాపులన్నీ తీసేస్తానన్నాడ లేదా..? మద్యం  దూరంగా పెడతానన్నాడా లేదా..?  పిల్లల చదువులు దెబ్బతింటున్నాయని ఏడ్చాడా లేదా..? మూడున్నరేళ్ల తర్వాత నేను అడుగుతున్నా. ఒక్క బెల్ట్ షాపైనా తీసేశాడా అని అడుగుతున్నా..? బాబు పుణ్యాన ప్రతి వీధి చివర కొత్త బెల్ట్ షాపు వచ్చాయి. బాబు హైటెక్ పాలన వల్ల ఫోన్ కొడితే చాలు ఇంటికే హోం డెలివరీ. మద్యం ఏరులై పారిస్తున్నాడు. 

అధికారంలోకి రావడానికి పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను నా అక్కచెల్లెమ్మలన్నడు. రూ. 14వేల కోట్లు పూర్తిగా మాఫీ చేస్తానన్నాడు. ఇక్కడ చాలామంది ఉన్నారు. మూడున్నరేళ్ల తర్వాత నేను అడుగుతున్నా. ఒక్క రూపాయైనా మాఫీ అయిందా అని అఢుగుతున్నా. మోసం చేశాడు. ఇదే చంద్రబాబు రైతులనుద్ధేశించి ఏమన్నడు. రూ. 87వేల 612 కోట్లు వ్యవసాయ రుణాలు బేషరతుగా మాఫీ చేస్తానన్నడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలన్నాడు. మూడున్నరేళ్ల తర్వాత నేను అడుగుతున్నా. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికొచ్చిందా అని అడుగుతున్నా...? మోసం చేశాడు.

బాబు పాలనలో ఏపంటకు గిట్టుబాటు లేదు. రైతులు అవస్థలు పడుతున్నారు. రూ. 5వేలకోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నడు. మూడున్నరేళ్ల తర్వాత అడుగుతున్నా ఒక్క రూపాయైనా పెట్టాడా అని అడుగుతున్నా. అంటే లేదు. కరెంట్ బిల్లులు గత గవర్నమెంట్ పెంచింది. నీనొచ్చాక తగ్గిస్తానన్నాడు. తగ్గించారా..? బాబు ముఖ్యమంత్రి కాకముందు కరెంటు బిల్లు రూ.200 ఉండేది. ఇప్పుడు రూ. 500 వస్తోంది. మోసం కాదా ఇది. బాబు ఇళ్ల మీద పన్నులు విపరీతంగా వేస్తున్నాడు.  చంద్రబాబు సీఎం అయ్యాక ఇంటి పన్నులు విపరీతంగా పెరిగాయి. మోసం చేశాడు. బాబు ముఖ్యమంత్రి కాకముందు అన్న మాటేమిటి.  కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా చదివిపిస్తానన్నాడు. ఇవాళ ఇంజినీరింగ్ ఫీజులు రూ. లక్ష అవుతోంది. ముస్టి వేసినట్టు రూ. 35వేలు ఇస్తా ఉన్నడు. మిగిలిన దాని పరిస్థితి ఏమిటంటే ఇళ్లు, పొలాలు అమ్ముకోవాలంట.  

ఇస్త్రీ పెట్టెలిచ్చి బాబు నాకు బీసీల మీద ప్రేమంటాడు. ఆ పిల్లలకు నేనున్నాను. తోడుగా నేనున్నాను. డాక్టర్లు అవుతారా, ఇంజినీర్లు అవుతారా, కలెక్టర్లు అవుతారా..? నేను చదివిపిస్తాను. ఆ భరోసా నాన్నగారిచ్చారు. మళ్లీ నేను ఇస్తున్నా. ఏ పేదవాడు అప్పులపాలు కాకూడదని వైయస్ఆర్ పరితపించారు. పేదవాడు అప్పులపాలవుతున్నాడంటే రెండే కారణాలని భావించారు. ఒకటి చదువుకునేటప్పుడు, రెండోది హాస్పిటల్ కు పోవాల్సి వచ్చినప్పుడు. ఆస్పత్రిలో చేర్పించినప్పుడు లక్షల రూపాయల ఖర్చు అవుతోంది. దీంతోరూ. 2,3 వడ్డీకి అప్పులు తెచ్చుకునేవాళ్లు. ఆ పరిస్థితిని వైయస్ఆర్ పూర్తిగా మార్చారు. దేశంలో ఎవరూ చేయనివిధంగా ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు. వైయస్ఆర్ హయాంలో 108కి ఫోన్ కొడితే చాలు కుయ్ కుయ్ కుయ్ అంటూ 20 నిమిషాల్లోనే అంబులెన్స్ వచ్చి బాగోలేని పేదవాడిని ఆస్పత్రికి తీసుకెళ్లి చిరునవ్వులతో ఇంటింకి పంపిచేది. ఇవాళ 108కు ఫోన్ కొడితే డీజిల్ లేదు, డ్రైవర్లు స్ట్రైకులో ఉన్నారని సమాధానమొస్తుంది. చంద్రబాబు పుణ్యాన ఆస్పత్రులకు 8నెలలుగా బకాయిలు. పేదవాడి ఆస్పత్రికి పోతే పేషెంట్ ను ముట్టుకోవాలంటే డాక్టర్లు భయపడుతున్నారు. ఇంత దారుణంగా ఆరోగ్య శ్రీ ఉంది. పేదవాడికి మూగ, చెవుడు ఉంటే ఆపరేషన్ చేయించాలంటే 6లక్షలవుతుంది. బాబు హయాంలో ఆపరేషన్లు కటింగ్. సంవత్సరం లోపే మూగ, చెవుడు కనుక్కోవాలట. లేకపోతే కటింగ్ అట. క్యాన్సర్ వస్తే కీమో థెరపీ చేయాలి. 7,8సార్లు చేస్తే తప్ప నయం కాదు. ఆరోగ్యశ్రీ దగ్గరకు పోతే రెండు సార్లు చేస్తున్నారు. క్యాన్సర్స ఆర్నెళ్ల తర్వాత మళ్లీ తిరగబడుతుంది. చనిపోతున్న పరిస్థితి. కిడ్నీ పేషెంట్ల పరిస్థితి అంతే. ఒకసారి డయాలసిస్ చేయించాలంటే 2వేలు అవుతుంది. వారానికి రెండు మూడు సార్లు చేయించాలి. నెలకు రూ.7వేలు ఖర్చు. పేషెంట్లు డయాలసిస్ కోసం ఆస్పత్రికి పోతే సంవత్సరం తర్వాత రమ్మంటున్నారు. ఇది ఆరోగ్య పరిస్థితి. ఇలాంటి మోసం చేసే బాబు పాలన మనకు కావాలా అని అడుగుతున్నా. 

దోమలబాబు బాబు దండయాత్ర ఏమైంది?
చంద్రబాబు దోమల మీద దండయాత్ర అన్నారు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి పేదల కష్టాల నుంచి తొలగించేందుకు దండయాత్ర చేస్తారు. అది కూడ సరిగా చేయరు.  దోమల మీద దండయాత్ర అంటే ఏమి చేయాలి. ఫాగింగ్ మిషన్స్ ద్వారా దోమలపై మందుచల్లాలి. కాకినాడలో రోజూ వచ్చే 220 టన్నుల చెత్తను ఎక్కడంటే అక్కడ విసిరేయటం వల్ల దోమలు వస్తున్నాయి. కనుక కాకినాడకు డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలి. కాకినాడలో ఎక్కడ చూసినా ఓపెన్ నాలాలు. మరి, దోమల మీద దండయాత్ర అని బాబు అంటున్నారని వైయస్ జగన్ ఎద్దేవా చేశారు. రోడ్డు విస్తరణ చేస్తామని బాబు చెప్పి ఎన్ని సంవత్సరాలైందని వైయస్ జగన్ ప్రశ్నిస్తే చేయలేదన్నారు. బాబు చేయడు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి చేస్తాను అంటాడు. నగరంలో మంచినీటికి బదులు కొలాయిలో మురికినీరు ఎన్నిచోట్ల వస్తున్నాయో బాబుకు తెల్సా అని ప్రశ్నించారు.  కాకినాడ నగరంలో  కచేరిపేట, శ్రీధర్ పేట, రేచెర్ల పేట, దమ్ములపేట, గోదారిపేట ఒక్కసారి వెళ్లి చూడు చంద్రబాబూ..? వర్షం వస్తే.. 17 ప్రాంతాలు మునుగుతాయి. ఒక్కసారి అక్కడకు వెళ్లి చూడమని బాబుకు హితవు పలికారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు వచ్చి బాబు ఫోజులు కొడుతున్నారు. ఇక్కడ చదువుకున్న యువకులకు ఉద్యోగాలు వచ్చాయా..?  రాజమండ్రిలో ఐటీ హబ్ వచ్చిందా..?కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు తన పేరును కబ్జాల కొండబాబుగా పేరు మార్చుకున్నారు.  లేకీమెగదగ్గ వద్ద 50 ఎకరాలు కబ్జా చేశారు. విశాఖ నుంచి రాష్ట్రంలో ప్రతి ముఖ్యమైన నగరంలో టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు కబ్జాలు చేస్తున్నారు. వాటిని బ్యాంకుల్లో తాకట్టు పెడుతున్నారు.  చివరకు, స్మశానాలను కూడా వదలటం లేదు. 

ఇళ్ల నిర్మాణం అని చంద్రబాబు మైకు పట్టుకొని మోసం చేస్తున్నారు.. 300 అడుగుల ప్లాట్ కట్టడానికి అడుగుకు వెయ్యి అని కాంట్రాక్టర్లు చెబుతారు. కానీ చంద్రబాబు పేదలకు అడుగుకు రెండు వేలకు ఇస్తున్నారు.  ఆరు లక్షలు ఇళ్లు ఇస్తున్నారన్నారు. లక్షన్నర కేంద్ర ప్రభుత్వం,లక్షన్నర రాష్ట్రప్రభుత్వం ఇస్తోందని, మిగతా మూడు లక్షలు పేదవాడిపేరున బ్యాంకుల నుంచి ఇప్పిస్తున్నారన్నారు. తర్వాత 20 ఏళ్లపాటు పేదవారు బ్యాంకులకు అప్పుచెల్లించాలట.  లంచాలు తీసుకొనేది బాబు అయితే అప్పులు పేదవాళ్లు కట్టాలట.  జీవితంలో అబద్ధం చెప్పనివాడు సత్యహరిశ్చంద్రుడు అయితే, ఒక్కనిజం చెప్పనివారిని నారా చంద్రబాబు అంటాం. ఇదీ బాబు నైజం. రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. మైక్ పట్టుకొని పలానది చేస్తానని చేయకపోతే కాలర్ పట్టుకొని నిలదీసేలావ్యవస్థలో మార్పు రావాలి. లేదంటే మళ్లీ చంద్రబాబు వచ్చి ప్రతి ఇంటికీ మారుతీ కారు అంటారు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం అంటారు. వ్యవస్థ మారాలంటే చంద్రబాబు లాంటి వ్యక్తిని బంగాళాఖాతంలో కలపాలి. నంద్యాల ఓట్లు వేసిన ప్రజల్ని ఎప్పుటికీ మార్చిపోను. కాకినాడలో మిమ్మల్ని మర్చిపోలేనని .. నన్ను నమ్మి ఓట్లు వేసిన మీ అందరి అభివృద్ధి పూచీ నాదని  వైయస్ జగన్ స్పష్టం చేశారు. 

మత్స్యకారుల్ని ఉద్దేశించి శ్రీ వైయస్ జగన్ మాట్లాడుతూ.. 
మత్య్యకారులకు 50 కేజీల బియ్యం, 5వేలు ఇస్తాం.. 
నవరత్నాల్లో భూములు ఉన్న కుటుంబాలకు న్యాయం చేశాం. మరి భూములు లేని కుటుంబాల కోసం పిల్లల్ని బడికి పంపించటం కోసమే ప్రత్యేకంగా పథకం ప్రవేశపెట్టామని మీ పిల్లల్ని బడికి పంపిస్తే.. చాలన్నారు. పిల్లల్ని బడికి పంపిస్తే 10, 15,18వేలు ఇంటికి వస్తుందన్నారు. పిల్లల్ని నేను చదివిస్తా అని  వైయస్ జగన్ భరోసా ఇచ్చారు. మత్య్యకారులకు ఇస్తామన్నది కూడా చంద్రబాబు ఇవ్వలేదన్నారు. సెలవు దినాల్లో 4వేలు, 30 కేజీల బియ్యం వస్తోందా అని  వైయస్ జగన్ ప్రశ్నించారు. సెలవు దినాల్లో 50 కేజీలు, 5వేలు మత్య్యకారులకు ఇస్తామని  వైయస్ జగన్ హామీ ఇచ్చారు.

Back to Top