కురుక్షేత్ర సంగ్రామానికి కాకినాడ రెండో ఓటుకావాలి

  • ఒక్క నిజం చెప్పని వ్యక్తిని చంద్రబాబు అంటారు
  • సంవత్సరంలో కొట్టుకుపోయే టీడీపీకి ఓటేస్తే మురిగిపోతుంది
  • చంద్రబాబువి మాటలు తప్ప చేతల్లో శూన్యం
  • ఎన్నికలు రాగానే చంద్రబాబు బీసీలపై ప్రేమ పుడుతోంది
  • సీఎం అయ్యాక ఈస్ట్‌గోదావరికి ఇచ్చిన హామీలు నెరవేర్చాడా..?
  • నంద్యాల, కాకినాడను నా గుండెల్లో పెట్టుకుంటా
  • అగ్రిగోల్డ్‌ బాధితులను అండగా ఉంటా
  • అన్నమ్మఘాట్‌లో జననేత వైయస్‌ జగన్‌ ప్రసంగం
కాకినాడ: ఒక్క అబద్ధం చెప్పని వాడిని సత్యహరిశ్చంద్రుడు అంటే, ఒక్క నిజం కూడా చెప్పని వాడిని నారా చంద్రబాబు నాయుడు అంటారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు.  వైయస్సార్సీపీకి ఓటు వేస్తే ముగిరిగిపోయినట్టేనని చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తు‍న్నారని, కానీ, చంద్రబాబుకు ఓటు వేస్తే అది మురిగిపోతుందని జగన్‌ పేర్కొన్నారు.  'ఏడాదిన్నర తర్వాత ఎన్నికలు వస్తాయని చంద్రబాబే చెబుతున్నారు. ఆ లెక్కన్న రాబోయేది మన పాలనే. మన పాలనలో కాకినాడ కౌన్సిల్‌ను అన్నిరకాలుగా అభివృద్ధి చేసుకుందాం' అని జగన్‌ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే మురిగిపోతుందని చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు. కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో భాగంగా వైయస్‌ జగన్‌ అన్నమ్మఘాట్‌ సెంటర్‌లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా జననేత మాట్లాడుతూ.. ఇంకో సంవత్సరంలో ప్రజల ప్రభుత్వం రానుందని, మన ప్రాంతాలను మనమే అభివృద్ధి చేసుకుందామని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మూడున్నరేళ్ల పాలనలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అభివృద్ధి మాటలకే తప్ప చేతల్లో శూన్యమన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని కాకినాడ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.....

మూడున్నర సంవత్సరాలుగా చంద్రబాబు పాలన చూస్తున్నాం. ఎన్నికల ముందు అనేక రకమైన మాటలు చెప్పాడు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా నెరవేర్చాడా..? ఎన్నికల ముందు ప్రతి పేదవాడికి ఇల్లు, మూడు సెంట్ల స్థలం అన్నాడు.. బాబు ఇప్పటి వరకు ఒక్క ఇల్లు అయినా కట్టించాడా.? చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందు రేషన్‌ దుకాణానికి వెళితే... తొమ్మిది సరుకులు దొరికేవి, కానీ ఇప్పుడు బాబు పాలనలో బియ్యం తప్ప ఏమైనా ఇస్తున్నారా..? ఇది మోసం కాదా అని ధ్వజమెత్తారు. 

ఎన్నికలకు ముందు టీవీ ఆన్‌ చేసినా, ఏ గోడల మీద చూసినా, చంద్రబాబు మైక్‌ పట్టుకుంటే వినిపించే మాట జాబు రావాలంటే బాబు రావాలని అన్నాడు. జాబు ఇవ్వలేకపోతే రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఇవాల్టికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి 39 నెలలు అయ్యింది. అంటే ప్రతి ఇంటికి చంద్రబాబు రూ. 78 వేల బాకీ పడ్డాడు. మూడున్నర సంవత్సరాల కాలంలో కనీసం ఒక్క రూపాయి అయినా ఇచ్చాడా అని ప్రజలను అడిగారు. 

ఎన్నికలకు ముందు బెల్ట్‌షాపులు లేకుండా చేస్తానన్నాడు. మూడున్నర సంవత్సరాల కాలంలో బెల్ట్‌సాపులు పోలేదు. పైగా బాబు హైటెక్‌ పాలనలో వీధి వీధికి ఒక షాపు పెట్టడమే కాకుండా ఫోన్‌ కొడితే చాలు హోం డెలవరీ అంట. ఇది మోసం కాదా..? 

అధికారంలోకి రాకముందు చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్నాడు. అక్కాచెల్లెమ్మలు మీ రుణాలు కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ అయ్యిందా అని అడిగారు. అధికారంలో రాకముందు రైతులను వదిలిపెట్టలేదు. రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానన్నాడు. బ్యాంక్‌లలో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. బ్యాంక్‌లలో పెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా.?లేదు. ఇది వంచన కాదా..? 

విద్యుత్‌ చార్జీలు విపరీతంగా పెరిగాయి. నేను వచ్చాక తగ్గిస్తానని, ఇదే కాకినాడలో మైక్‌ పట్టుకొని చెప్పాడు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత కరెంట్‌ చార్జీలు పెంచకుండా ఉన్నాడా.. బాబు సీఎం కాకముందు ఇంటికి రూ. 200 కరెంట్‌ బిల్లు వచ్చేది. ఇవాళ రూ. 5 వందలు వస్తుంది. ఇది అన్యాయం కాదా..? 

ప్రతి పేదవాడు ఉన్నత చదువులు చదువుకోవాలని దివంగత మహానేత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రియంబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏం చదువుకుంటారో చదవండి పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కానీ చంద్రబాబు హయాంలో ఇంజినీరింగ్‌ చదవాలంటే సంవత్సరానికి ఫీజు రూ. లక్ష, బాబు రియంబర్స్‌మెంట్‌ కిందఇచ్చేది ముష్టివేసినట్లు రూ. 35 వేలు ఇస్తున్నాడు. ఇటువంటి చంద్రబాబు మనకు కావాలా.. అని కాకినాడ ప్రజలను అడిగారు. 

ఎన్నికలు రాగానే బీసీలపై ప్రేమ అంటాడు.. ఇస్త్రీ పెట్టెలు ఇవ్వడం కాదు ప్రేమ అంటే. నా కుటుంబ సభ్యులు అనుకొని వారి పిల్లలను చదివించాలి. అది బీసీలపై ప్రేమ. చంద్రబాబు మాటలు చెప్పడంలో కోటలు దాటేస్తాడు. చేతల్లో మాత్రం శూన్యం.

పేదవాడు కార్పొరేట్‌ వైద్యం చేయించుకోవాలని ప్రియతమనేత వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టారు. 108 ఫోన్‌ కొడితే 20 నిమిషాల్లో అంబులెన్స్‌ వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లేది. ఉచితంగా వైద్యం చేయించి చిరునవ్వులతో ఇంటింకి పంపించేవారు.  ఇవాళ 108కి ఫోన్‌ కొడితే.. డిజిల్‌ లేదు, డ్రైవర్లు ధర్నాలో ఉన్నారనే సమాధానం వస్తుంది. నెట్‌వర్క్‌ ఆసుప్రతులకు 8 నెలల నుంచి బకాయిలు చెల్లించలేదు. దీంతో ఆరోగ్యశ్రీ పథకం అడుగంటుతోంది. 
 
చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానాన్ని నెరవేర్చలేదు. ఎన్నికల అయిపోయిన తరువాత చస్తే నిజం చెప్పడు. ఒక్క అబద్ధం చెప్పని వ్యక్తి సత్యహరిశ్చంద్రుడైతే.. జీవితంలో ఒక్క నిజం చెప్పని వ్యక్తిని నారా చంద్రబాబు అంటారు.  

ముఖ్యమంత్రి అయిన తరువాత అసెంబ్లీలో ఈస్ట్‌ గోదావరి జిల్లాకు పెట్రోలియం విశ్వవిద్యాలయం, కాకినాడకు మరో పోర్టు, ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ పార్కు, పారిశ్రామిక కాంప్లెక్స్, స్మార్ట్‌ సిటీ అంట, కాకినాడలో ఎల్‌ఎన్‌జీ టర్మినల్, నౌక నిర్మాణ ఫ్యాక్టరీ, రాజమంద్రిలో ఐటీ హబ్‌ అన్నాడు. ఇవన్నీ ఎక్కడైనా కనిపించాయా..? 

నంద్యాలలో ఎన్నికలు రాగానే నంద్యాలను స్మార్ట్‌సిటీ చేస్తానన్నాడు. మళ్లీ అదే అబద్ధాలు కాకినాడకు వచ్చి చెబుతున్నాడు. మరో సంవత్సరకాలంలో కురుక్షేత్ర మహాసంగ్రామం జరుగబోతుంది. ఇవాళ కాకినాడ ప్రజలు వేసే ఓటుతో కురుక్షేత్ర మహా సంగ్రామంలో మార్పు రావాలి. ఒక ఓటు నంద్యాల నుంచి నాంది పలుకుతుంది. రెండో ఓటు కాకినాడ మున్సిపాలిటీ నుంచి రావాలన్నారు. రాజకీయాల్లో మార్పు రావాలి. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చకపోతే కాలర్‌ పట్టుకొని నిలదీస్తారనే భయం నేతల్లో ఉండాలి. 
లేకపోతే మరో సంవత్సరం తరువాత వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ప్రతి ఇంటికి మారుతి కారు, కిలో బంగారం ఇస్తానంటాడు. ఈ వ్యవస్థ మారకపోతే రాజకీయాలే దిగజారుతాయి. 

కాకినాడ ప్రజలు వేసే ప్రతి ఓటు న్యాయంవైపు వేయండి. ధర్మంవైపు మీరంతా నిలబడాలని ప్రార్థిస్తున్నా.. కాకినాడను, నంద్యాలను ఎన్నటికీ మరువను. నవరత్నాలను తీసుకొచ్చి రాష్ట్రాన్ని బాగు చేద్దాం.. దానికి నాంది నంద్యాల , కాకినాడ నుంచి పలుకుదామన్నారు. మీ అందరికీ అన్ని రకాలుగా తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నా.. 

అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉంటా. అసెంబ్లీలో అగ్రిగోల్డ్‌ సమస్యపై చంద్రబాబును నిలదీశాను.  రూ. వెయ్యి కోట్లు ఇచ్చేందుకు చంద్రబాబుకు మానవత్వం లేదు. మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం రాగానే మూడు నెలల్లోనే సమస్య పరిష్కరిస్తా.. 
Back to Top