మహానేత పాలన గుర్తుకు తెచ్చుకోండి

– ప్రతి కుటుంబానికి నేనున్నాని వైయస్‌ఆర్‌ హామీ ఇచ్చారు
– ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేదల బతుకుల్లో వెలుగులు
– ఆరోగ్యశ్రీతో పేదలకు సంజీవిని అయ్యారు
– చంద్రబాబు  మూడున్నరేళ్ల పాలన దారుణం
– ఎన్నికలకు ముందు బాబు ఇచ్చిన హామీలు ఏంటీ? 
– ఎన్నికలు అయిపోయిన తరువాత చేస్తున్నదేంటీ?
–బాబు మోసాలకు వ్యతిరేకంగా ఓటు వేయండి
– పులివెందుల మాదిరిగా నంద్యాలను అభివృద్ధి చేస్తా

నంద్యాల: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలన గుర్తు చేసుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. మహానేత పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారని, పేదల బతుకుల్లో వెలుగులు నింపారని గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎనిమిదేళ్ల క్రితం చనిపోతూ ఇంత పెద్ద కుటుంబానికి తనకిచ్చారని, మీరే నా ఆస్తి అని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా 10వ రోజు పట్టణంలోని సాయిబాబనగర్‌ అర్చీ ఏరియాలో వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మూడున్నరేళ్ల పాలనను ఆయన తూర్పారబట్టారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అయ్యేందుకు చంద్రబాబు చెప్పిన మాటలు ఏంటీ? అధికారంలోకి వచ్చాక చేస్తున్నది ఏంటని వైయస్‌ జగన్‌ నిలదీశారు. ఈ మూడున్నరేళ్ల కాలంలో చంద్రబాబు మోసాలకు వ్యతిరేకంగా ఓటు వేస్తున్నామని గుర్తు చేశారు. ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో చంద్రబాబు చేసిన అవినీతి, దుర్మార్గానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.  
– నంద్యాల ఉప ఎన్నిక వచ్చేదాకా మూడున్నరేళ్ల కాలంలో ఏనాడైనా ఒక్కరోజైనా కూడా చంద్రబాబు, ఆయన మంత్రులను నంద్యాల రోడ్లపై మీరు చూశారా?
–ప్రతి పేద వాడికి మూడు సెంట్ల స్థలం, పక్కా ఇల్లు కట్టిస్తామన్నారు. ఈ మూడేళ్లలో ఒక్క ఇల్లైనా కట్టించారా?
– సాగు కోసం ఒక్క ఎకరా భూమి అయినా పంపిణీ చేశారా?
–రేషన్‌షాపుల్లో గతంలో 9 రకాల సరుకులు అందేవి. ఇప్పుడు బియ్యం ఒక్కటే ఇస్తున్నారు.
సాకులు చూపించి ఉన్న రేషన్‌కార్డులను కూడా పీకేస్తున్నారు.
–బెల్ట్‌షాపులు అన్నవి లేకుండా చేస్తానని ఊదరగొట్టారు. బెల్ట్‌షాపులు ఏమైనా తగ్గాయా?. మద్యం మీద వచ్చే ఆదాయం పెరిగింది. ప్రతి కాలనీలో బెల్ట్‌షాపులు అందుబాటులోకి తీసుకొని వచ్చారు. 
– ముఖ్యమంత్రి కావడం కోసం నాడు చంద్రబాబు అన్న మాటలు ఏంటీ? డ్వాక్రా సంఘాల అక్కచెల్లెమ్మలకు సంబంధించి రూ.14 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తానన్నారు. ఒక్క రూపాయి అయినా మాఫీ అయ్యిందా అని అడుగుతున్నాను. 
–రైతులకు సంబంధించి రూ.87 వేల కోట్ల మాఫీ చేస్తామన్నారు. బ్యాంకుల్లోని బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. మీ బంగారం ఇంటికి వచ్చిందా? రుణమాఫీ కథ దేవుడెరుగు. సున్నా వడ్డీ, పావలా వడ్డీకి వచ్చే రుణాలు ఇప్పుడు రావడం లేదు. రైతులు అపరాధ వడ్డీలు కడుతున్నారు. రుణమాఫీ కింద ఫోజు కొడుతూ ప్రభుత్వం ఇచ్చింది..సంవత్సరానికి రూ.3 వేల కోట్లు.
– చదువుకున్న పిల్లలను వదిలిపెట్టలేదు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జాబు ఇవ్వకపోతే నెల నెల ఇంటింటికి రూ.2 వేలు ఇస్తానన్నారు. ప్రతి ఇంటికి రూ.76 వేలు బాకీ పడ్డారు. 
– పేదవాళ్లు తమ పిల్లలను చదివించుకునేందుకు పేదరికం అడ్డురాకూడదను, ప్రతి కుటుంబం నుంచి ఒక్కరైనా ఇంజనీర్‌ కావాలని, డాక్టర్‌ కావాలని విద్యార్థులకు మహానేత భరోసా ఇచ్చారు. ఇందుకోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇవాళ ఇంజనీరింగ్‌ ఫీజు సంవత్సరానికి లక్ష అవుతుంది. ప్రభుత్వం ఇచ్చేది మాత్రం రూ.35 వేలు మాత్రమే ఇస్తున్నారు. తమ పిల్లలను చదివించుకునేందుకు ఇల్లులు అమ్ముకుంటున్నారు. ఇటువంటి చంద్రబాబుకు మనం ఓటు వేస్తామా?
– వైద్యం కోసం అప్పుల పాలు అయ్యే పరిస్థితి రాకుండదనే మానవతావాదిగా  దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆలోచించి ఆరోగ్యశ్రీ, 108, 104 పథకాలు ప్రవేశపెట్టారు.  ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు వైద్యం ఉచితంగా చేయించి చిరునవ్వుతో ఇంటికి పంపించేవారు. ఇవాళ ఆరోగ్య పరిస్థితి అధ్వాన్నంగా మారింది. నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు 8 నెలలుగా బిల్లులు చెల్లించడం లేదు. 108 వాహనాలకు డీజిల్‌కు డబ్బులు లేవు. డ్రైవర్లకు జీతాలు లేవు. 
–ప్రజలతో పని ఉంటేనే చంద్రబాబు నోట్లో నుంచి వాగ్ధానాలు వస్తాయి. కర్నూలు జిల్లా స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు అనేక వాగ్ధానాలు చేశారు. ఒక్కటైనా నెరవేర్చారా?
–ఇటువంటి వ్యక్తి మళ్లీ ఇవాళ నంద్యాలకు వచ్చారు.  ఉప ఎన్నిక వచ్చే సరికి మళ్లీ నంద్యాల ప్రజలు గుర్తుకు వచ్చారు. మూడు కిలోమీటర్లు రోడ్డు ఇరుపక్కలా బిల్డింగ్‌లు పగులగొడితే అది అభివృద్ధి అంటా? రోడ్డు విస్తరణ సమయంలో అందర్ని పిలిచి వారిని ఒప్పించి పనులు మొదలు పెట్టాలి. ఇక్కడ మాత్రం బుల్డోజర్లతో పగులగొడుతున్నారు.
–చంద్రబాబు ఇళ్ల స్కీం చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. ప్లాట్‌ కట్టడానికి అడుగుకు వెయ్యి రూపాయిలు కూడా మించదని ఏ కాంట్రాక్టర్‌ అయినా చెబుతారు. 300 అడుగుల ఇల్లు కట్టడానికి రూ.3 లక్షలు సరిపోతుంది. కానీ చంద్రబాబు ఆ ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షలు పెంచారు. ఆ ఇంటి నిర్మాణాన్ని చంద్రబాబు తన బినామీ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. రూ.3 లక్షలు బ్యాంకు అప్పు ఇస్తుందట. ఈ డబ్బు 20 ఏళ్ల పాటు నెల నెల రూ.3 వేలు బ్యాంకులో కంతులు కట్టాలట. ఇది చంద్రబాబు అభివృద్ధి
–నంద్యాల అభివృద్ధి బాద్యత నాకు వదిలేయండి. ఏ ఒ క్కరు భయపడాల్సిన అవసరం లేదు. బ్యాంకులకు అప్పులు కట్టుకోవాల్సిన పని లేదని హామీ ఇస్తున్నాను. ప్రతి పేద వాడికి ఉచితంగా ఇల్లు కట్టిస్తానని మాట ఇస్తున్నా.
–చంద్రబాబు రాబోయే రోజుల్లో మీ వద్దకు వస్తారు. మూడున్నర సంవత్సరాలుగా పరిపాలన చేసిన చంద్రబాబు వద్ద విపరీతమైన డబ్బు ఉంది. ఏ ఒక్కటి వదిలిపెట్టలేదు.  అవినీతి సొమ్ముతో మీ వద్దకు వస్తారు. ఎమ్మెల్యేను కొనేశాం. మిమ్మల్ని కొనడం ఓ లెక్కా అన్నట్లుగా చంద్రబాబు అహంకారంగా ఉన్నారు. ఆయన కన్నులు నెత్తికి వచ్చాయి. 
–చంద్రబాబు మాదిరిగా నా వద్ద అధికారం లేదు. డబ్బు లేదు. టî వీ చానల్స్‌ లేవు. నా వద్ద ఉన్నది ఆ దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎనిమిదేళ్ల కిత్రం చనిపోతు నాకిచ్చి పోయిన ఇంత పెద్ద కుటుంబమే నా ఆస్తి. మహానేత అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇంకా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడమే నా ఆస్తి. వైయస్‌ జగన్‌ కూడా వాళ్ల నాన్న మాదిరిగానే మంచి చేయడానికి తపిస్తున్నారు. నవరత్నాలు ప్రకటించారు. ప్రతి పేదవాడి గుండెల్లో బతకాలని చూస్తున్నారన్న నమ్మకమే నాకున్న ఆస్తి. 
–చంద్రబాబు మీ వద్దకు వచ్చి జేబుల్లో నుంచి డబ్బులు, దేవుడి ఫోటో తీస్తారు. మీ తో ప్రమాణం చేయిస్తారు. ఏ దేవుడు కూడా పాపానికి ఓటు వేయమని చెప్పడు. దయ్యాలు మాత్రమే అలా చెబుతాయి. ఆ దయ్యాలు కూడా దేవుడి ఫోటోతో ప్రమాణం చేయిస్తాయి. అలా చేసినప్పుడు మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ఒక్కసారి కళ్లు మూసుకొని ధర్మం వైపు మేముంటామని మనసులో అనుకొండి. గొడవ పడాల్సిన అవసరం లేదు. లౌక్యంగా వ్యవహరించండి. న్యాయానికే ఓటు వేయండి..ధర్మానికే ఓటు వేయాలని అభ్యర్థించారు. వ్యవస్థలో మార్పు రావాలంటే రాజకీయాలను ప్రజలు నిలదీస్తారనే భయం పుట్టాలి. మీరు వేసే ఓటు రేపు జరిగే మార్పుకు నాంది కావాలని వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చారు.
Back to Top