నంద్యాల‌లో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌చారం ప్రారంభం

నంద్యాల‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌చారాన్ని కొద్ది సేప‌టి క్రితం ప్రారంభించారు. త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆరో రోజు సోమ‌వారం నంద్యాల ప‌ట్ట‌ణంలోని ప‌ద్మావతి నగర్‌, మార్కెట్‌ యార్డ్‌, ఎస్‌బీఐ కాలనీ, గంగుల ప్రభాకర్‌ రెడ్డి సెంటర్‌, చంద్రశేఖర్‌ టాకీస్‌ మీదుగా వైయ‌స్ జ‌గ‌న్ రోడ్‌ షో నిర్వ‌హించ‌నున్నారు. అనంతరం సుద్దులు పేట, గిరినాథ్‌ సెంటర్, గోపాల్‌నగర్, పీపీనాగిరెడ్డి సెంటర్‌, విశ్వనగర్‌, నవర్తినగర్‌, ఎన్జీవోస్‌ కాలనీ, లలితా నగర్‌, పొన్నాపురం కాలనీలో వైయ‌స్‌ జగన్‌ ప్రచారం నిర్వహించనున్నారు.  ఆయా ప్ర‌ధాన కూడ‌లిలో ప్ర‌జ‌ల‌నుద్దేశించి ప్ర‌తిప‌క్ష నేత మాట్లాడ‌నున్నారు. నంద్యాల ఉప ఎన్నిక‌లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్‌రెడ్డిని గెలిపించాల‌ని వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు.  ఎన్‌జీవో కాల‌నీలో ఎస్వీఆర్ క‌ళాశాల‌ల అధిప‌తి వెంక‌ట్రామిరెడ్డి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని క‌లిశారు. వైయ‌స్ జ‌గ‌న్ కోసం ఆయా కాల‌నీల‌వాసులు ప‌నులు మానుకొని ఎదురుచూస్తున్నారు.

Back to Top