కురుక్షేత్ర సంగ్రామానికి నంద్యాల నాంది కావాలి

  • ప్రతిపక్షం పోటీ పెట్టడంతో బాబులోని కుంభకర్ణుడు నిద్రలేచాడు
  • అన్ని వర్గాలను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబే
  • అక్కాచెల్లెమ్మలు కన్నీళ్లు పెట్టుకుంటే రాష్ట్రానికే అరిష్టం
  • రుణాలు మాఫీ చేయకుండా వారితో కన్నీళ్లు పెట్టించిన సీఎం 
  • రోడ్లు పగులగొడితే అభివృద్ధి అంటారా బాబూ
  • ఇళ్ల పేరుతో కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్న చంద్రబాబు
  • శ్రీనివాస సెంటర్‌లో వైయస్‌ జగన్‌ ప్రసంగం
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రతిపక్షం పోటీ పెట్టగానే ముఖ్యమంత్రి చంద్రబాబులోని కుంభకర్ణుడు నిద్రలేచాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నికలు రాగానే మూడున్నర ఏళ్లుగా కనిపించని చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, మంత్రులు, ఎమ్మెల్యేలంతా నంద్యాల నడిరోడ్లపై కనిపిస్తున్నారన్నారు. ఐదో రోజు రోడ్‌ షోలో భాగంగా నంద్యాల టౌన్‌ శ్రీనివాస సెంటర్‌లో జననేత మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు నైజం గురించి ఆ పార్టీలో చేరిన ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి గొప్పగా చెప్పాడని చురకంటించారు. నంద్యాల చుట్టు పక్కల నియోజకవర్గాల ఎమ్మెల్యేలంతా ఎప్పుడు పైకిపోతారా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని, అప్పుడైనా కుంభకర్ణుడు నిద్రలేస్తాడని చెప్పాడన్నారు. మూడున్నర పాలనలో చంద్రబాబు పాలనా సామాజిక వర్గానికి అన్యాయం జరగకుండా పాలన సాగిందా అని ప్రజలను అడిగారు. ప్రతీ సామాజిక వర్గాన్ని మోసం చేశాడని అందుకని కొన్ని వర్గాలు ఆగ్రహంతో రగిలిపోతున్నాయన్నారు. 

ప్రతీ ఇంటికి చంద్రబాబు రూ. 76 వేలు బాకీ
బాబు ముఖ్యమంత్రి అయితే తాకట్టు పెట్టిన బంగారం ఇంటికి వస్తుందని, రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని రైతులను వెన్నుపోటు పొడిచారని వైయస్‌ జగన్‌ మండిపడ్డారు. అక్కా చెల్లెమ్మల కళ్లల్లో నీళ్లు తిరిగితే రాష్ట్రానికే అరిష్టమని, పొదుపు సంఘాల రుణాలన్నీ రూ. 14వేల కోట్లు మాఫీ చేస్తానని అడవారికి కూడా వెన్నుపోటు పొడిచారన్నారు. ఓటు బ్యాంక్‌ కోసం చదువుకుంటున్న పిల్లలను కూడా వదల కుండా జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని, బాబు ఇవ్వకపోతే ప్రతి ఇంటికి రూ. 2 వేల భృతి కల్పిస్తామని నేటికి చంద్రబాబు ప్రతి ఇంటికీ 76 వేలు బాకీ పడ్డారన్నారు. చంద్రబాబు హయాంలో రైతులు, అక్క చెల్లెమ్మలు, చివరకు చదువుకుంటున్న పిల్లలు కూడా మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తానని ఇప్పటి వరకు ఒక్క ఇల్లు అయినా కట్టించాడా అని శ్రీనివాస సెంటర్‌ ప్రజానికాన్ని అడిగారు. చంద్రబాబు చెప్పి అబద్ధాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి అయిన తరువాత కర్నూలుకు వచ్చి లేనిపోని హామీలిచ్చి వాటిల్లో ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు.

అన్యాయ పరిపాలనను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి
రెండు కిలోమీటర్ల మేర రోడ్డు పగులగొట్టితే అభివృద్ధి అంటారా చంద్రబాబూ అని వైయస్‌ జగన్‌ విమర్శించారు. అసలు అభివృద్ధి అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు.  జనాభా పెరుగుదలకు అనుగూనంగా రోడ్డు విస్తరణ చేస్తూనే ఉంటారని మూడున్నర సంవత్సరాలు నంద్యాలను పట్టించుకోని బాబు ఉప ఎన్నికలు రాగానే రోడ్లు పగులగొట్టి ఇదే అభివృద్ధి అని ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. వ్యాపారులకు చెప్పకుండా రోడ్డు ధ్వంసం చేసి సెంట్‌ రూ. 50 లక్షలు పలికే స్థలాన్ని రూ. 18 వేలు ముష్టి వేసినట్లుగా పరిహారం ఇస్తానని మోసం చేస్తున్నాడన్నారు. నంద్యాలలో ఇల్లు కట్టిస్తానని చెప్పి కాంట్రాక్టర్‌లకు దోచిపెట్టేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారన్నారు. రూ. వెయ్యికి అడుగు నిర్మించే కాంట్రాక్టర్లు ఉన్నా చంద్రబాబు రూ. 2 వేలకు పెంచి సామాన్య ప్రజలను మోసం చేస్తున్నాడన్నారు. 20 సంవత్సరాల వరకు బ్యాంక్‌లకు అప్పు కడుతూనే ఉండాలా అని ప్రశ్నించారు. సంవత్సరంలోపే మళ్లీ ఎన్నికలు వస్తాయని, కురుక్షేత్ర మహా సంగ్రామానికి నంద్యాల నుంచే నాంది పలకాలని ప్రజలను కోరారు. అన్యాయ పరిపాలను రాష్ట్రం నుంచి తిరిమికొట్టాలని ప్రజలకు సూచించారు. అన్యాయానికి, న్యాయానికి జరుగుతున్న పోరాటంలో ప్రజలంతా న్యాయంవైపు నిలబడాలన్నారు. 
Back to Top