మీరేసే ప్రతి ఓటు నా గుండెల్లో గుర్తుండిపోతుంది

పాండురంగాపురంలో వైయస్‌ జగన్‌ రోడ్‌ షో
పులివెందులలా నంద్యాలను అభివృద్ధి చేస్తా: వైయస్‌ జగన్‌
నంద్యాల: చంద్రబాబు అవినీతి పరిపాలనకు వ్యతిరేకంగా మీరేసే ప్రతీ ఓటు నా గుండెల్లో గుర్తుకు ఉంటుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నంద్యాల ప్రజలను ఉద్దేశించి అన్నారు. మూడో రోజు నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పాండురంగాపురం రోడ్‌షోలో వైయస్‌ జగన్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా పులివెందుల తరువాత నంద్యాలను అంతగా అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. కేసీ కెనాలపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు రెండు పంటలు పండే విధంగా నీరు తీసుకువస్తానన్నారు. అందే విధంగా గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు సిద్ధేశ్వరం అలుకు కూడా స్టడీ చేసి వీలైతే ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తానన్నారు. ప్రతి ఇంట్లో (వైయస్‌ఆర్‌) నాన్న ఫోటోతో పాటు నా ఫోటో కూడా పెట్టుకునే విధంగా అభివృద్ధి చేస్తానన్నారు. నీతికి, అవినీతికి జరుగుతున్న సమరంలో వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి ఓటు వేసి ప్రజలు దీవించాలని కోరారు.
Back to Top